- Telugu News Photo Gallery Business photos The PM Kisan scheme is coming to a halt for these farmers... this is the real reason!
PM Kisan: ఈ రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్ స్కీమ్.. అసలు కారణం ఇదే!
PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 21వ విడత రావాల్సి ఉంది. ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదరు చూస్తున్నారు రైతులు. రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2,000 ఉచితంగా సహాయం అందిస్తుంది..
Updated on: Nov 07, 2025 | 6:30 PM

PM Kisan scheme: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు పీఎం కిసాన్ పథకాన్ని తీసుకువచ్చింది కేంద్రం. అయితే ఇప్పటి వరకు రైతులకు 20వ విడత పీఎం కిసాన్ డబ్బలను అందిజేసింది. ఇప్పుడు 21వ విడత రావాల్సి ఉంది. ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదరు చూస్తున్నారు రైతులు. రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2,000 ఉచితంగా సహాయం అందిస్తుంది. సంవత్సరానికి రూ. 6,000 విడుదల చేస్తుంది.

ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?: వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతు అయినా ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుగా మారడానికి అర్హులు.

ఎవరు అనర్హులు?: కింది రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు అర్హులు కాదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కుటుంబంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, ప్రస్తుత లేదా మాజీ సభ్యులకు ఈ పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉండదు.

అలాగే తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి నుండి బదిలీ చేయబడిన భూమిని కలిగి ఉన్న పిల్లలకు కూడా PM కిసాన్ డబ్బు అందదు. కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి పీఎం కిసాన్ రాదు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి వస్తుంది.

పీఎంకిసాన్ పథకానికి అర్హత కలిగి ఉండి, నమోదు చేసుకున్నప్పటికీ eKYC చేయని రైతులకు డబ్బు అందదు. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కేవైసీ చేసుకోకుంటే వారికి ఈ విడత నిలిపివేయనుంది కేంద్రం. కేవైసీ వివరాలు అందించాలని ఇప్పటికే కేంద్రం పదేపదే సూచించింది. అయినా కేవైసీ చేసుకోలేని వారు ఇప్పటి చాలా మంది ఉన్నారు. వారికి వచ్చే విడత అందదని గుర్తించుకోవాలి.

పీఎం కిసాన్ పథకంలో బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే డబ్బు అందదు. ఆధార్ ద్వారా eKYCతో పాటు భూమి పత్రాలను తిరిగి సమర్పించడం తప్పనిసరి. ఇది చేయకపోతే కిసాన్ డబ్బు రాదు.




