AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: ఏటీఎంలో క్యాన్సిల్‌ బటన్‌ను రెండు సార్లు నొక్కితే ఏమవుతుందో తెలుసా?

ATM పిన్‌ను కూడా క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యం. సులభమైన పిన్‌ నెంబర్లను పెట్టుకోవద్దని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 3–6 నెలలకు పిన్‌ను మార్చడం, పుట్టినరోజు, 1234, 1111 వంటి సులభంగా ఊహించగల పిన్‌లను వాడవద్దని, ఎప్పుడు కూడా ఏటీఎం

ATM: ఏటీఎంలో క్యాన్సిల్‌ బటన్‌ను రెండు సార్లు నొక్కితే ఏమవుతుందో తెలుసా?
Subhash Goud
|

Updated on: Aug 22, 2025 | 8:18 AM

Share

ATM: చాలా మంది ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటుంటారు. అయితే ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల మోసాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అజాగ్రత్తగా ఉన్నా దారుణంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఏటీఎం మోసాల ఘటనలు ఎన్నోజరిగాయి. ఏటీఎంకు వెళ్లినప్పుడు ఏటీఎం కార్డు, పిన్‌ నంబర్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్లు సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల తప్పులను ఉపయోగించి వివిధ మార్గాల ద్వారా డబ్బును దోచుకుంటున్నారు. చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: TGSRTC కార్గో నుంచి తీసుకెళ్లని వస్తువుల వేలం.. 90 శాతం డిస్కౌంట్

ఇటీవల సోషల్ మీడియాలో ఒక సమాచారం తెగ వైరల్ అయింది. ఏటీఎం మెషీన్‌లోని రద్దు బటన్‌ను రెండుసార్లు ప్రెస్‌ చేయడం ద్వారా ATM మోసాన్ని అరికట్టవచ్చని చెబుతున్నారు. ప్రజలలో ఈ వాదన వలన పెద్ద గందరగోళం ఏర్పడింది. కానీ ఈ వైరల్‌ అవుతున్నదానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది. క్యాన్సిల్‌ బటన్‌ రెండు సార్లు నొక్కడం ద్వారా మోసాన్ని నివారించవచ్చన్న వాదనలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇది తప్పు అని తెలిపింది. RBI కూడా దీనికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ATMలో రద్దు బటన్ (Cancel Key) కేవలం లావాదేవీని రద్దు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, హ్యాకింగ్, కార్డ్ స్కిమ్మింగ్, ఫిషింగ్ వంటి మోసాలను నివారించడానికి కాదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

ఇలాంటి పిన్‌ నెంబర్లను అస్సలు పెట్టుకోకండి:

ATM పిన్‌ను కూడా క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యం. సులభమైన పిన్‌ నెంబర్లను పెట్టుకోవద్దని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 3–6 నెలలకు పిన్‌ను మార్చడం, పుట్టినరోజు, 1234, 1111 వంటి సులభంగా ఊహించగల పిన్‌లను వాడవద్దని, ఎప్పుడు కూడా ఏటీఎం పిన్‌ నెంబర్‌ను స్ట్రాంగ్‌ నంబర్‌ ఉండాలని పీఐబీ తెలిపింది.

Atm Pin Pib

ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో పాపం.. చిన్నారిపై వీధి కుక్కల కృరత్వం.. ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి