AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: కార్గో నుంచి తీసుకెళ్లని ఫోన్లు, చీరలు, టీవీలు, ఎల్‌ఈడీ లైట్స్‌.. 90 శాతం డిస్కౌంట్‌తో వేలం

TGSRTC: జేబీఎస్, ఎంజీబీఎస్​లలోని కార్గో డెలివరీ కేంద్రాల్లో వందల కొద్దీ వస్తువులు పడి ఉన్నాయి. వీటిలో మొబైల్స్, టీవీలు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలు, ఫుడ్​ఐటమ్స్​ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో వీటిని బుక్ చేసి కార్గోకు వచ్చిన తర్వాత తీసుకువెళ్లడం లేదంటున్నారు అధికారులు..

TGSRTC: కార్గో నుంచి తీసుకెళ్లని ఫోన్లు, చీరలు, టీవీలు, ఎల్‌ఈడీ లైట్స్‌.. 90 శాతం డిస్కౌంట్‌తో వేలం
Subhash Goud
|

Updated on: Aug 22, 2025 | 7:48 AM

Share

తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఆర్టీసీ కార్గోలో కొన్ని పార్శిళ్లు గమ్యం చేరలేకపోతున్నాయి. అయితే కార్గో నుంచి బట్టలు, టీవీలు, ఎల్‌ఈడీ లైట్స్‌, ఇతర కిచెన్‌ వస్తువులను తీసుకెళ్లని వాటిని వేలం వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. ఆసక్తిగల వారు జేబీఎస్‌ బస్టాండ్‌లోని 14వ బస్టాప్‌ కార్గో సెంటర్‌ వద్ద వీటిని వేలం వేస్తున్నారు. గత రోజులుగా కొనసాగుతున్న ఈ వేలం ఈ రోజుతో ముగియనుంది. అంటే 22వ తేదీతో ముగియనుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే కార్గోలో వచ్చిన పార్శిళ్లను ఎవరూ రాకపోవడంతో ఆ వస్తువులను ఇప్పుడు బహిరంగ వేలంలో విక్రయిస్తున్నారు. డెలివరీ కాని ఈ సరుకులు ఆర్టీసీ గోదాముల్లో పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. చాలామంది కస్టమర్లు తప్పుడు చిరునామాలు లేదా పనిచేయని ఫోన్ నెంబర్లు అందించడంతో వారి వద్దకు చేరలేకపోయాయి. నిబంధనల ప్రకారం.. 45 రోజుల్లోపు తీసుకోని వస్తువులను వేలం వేయడానికి ఆర్టీసీకి అధికారం ఉంటుంది. ఈ వేలం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  నిర్వహించనున్నారు.

సిటీలోని 90 ఏరియాల్లో సెంటర్లు :

హైదరాబాద్‌ నగరంతో పాటు పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వస్తువులను చేరవేసేందుకు కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ సిటీలోని 90 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజా మాబాద్​, మెదక్​ తదితర జిల్లాల్లోనూ కేంద్రాలున్నాయి. ప్రతినెలా ఆయా ప్రాంతాలకు 7 వేల నుంచి 8 వేల వస్తువులను ఆర్టీసీ డెలివరీ చేస్తోంది. ఇందులో 600 నుంచి 700 వరకు వస్తువులను కస్టమర్లు తీసుకువెళ్లడం లేదు.

ఇలా జేబీఎస్, ఎంజీబీఎస్​లలోని కార్గో డెలివరీ కేంద్రాల్లో వందల కొద్దీ వస్తువులు పడి ఉన్నాయి. వీటిలో మొబైల్స్, టీవీలు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలు, ఫుడ్​ఐటమ్స్​ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో వీటిని బుక్ చేసి కార్గోకు వచ్చిన తర్వాత తీసుకువెళ్లడం లేదంటున్నారు అధికారులు. సాధారణంగా కార్గోకు వచ్చిన పార్శిళ్లను మూడు రోజుల్లో ఉచితంగా డెలివరీ చేస్తారు. తర్వాత రోజుకు రూ. 25 పెనాల్టీ వసూలు చేస్తారు. చాలామందిని కాంటాక్ట్​కావడానికి ప్రయత్నిస్తే అడ్రస్ , ఫోన్ నంబరు తప్పుగా ఉండడంతో వీలు కావడం లేదంటున్నారు.

డిస్కౌంట్‌ ఇలా..

ప్రతినెలా 30 నుంచి 50 శాతం డిస్కౌంట్​తో వస్తువుల వేలం వేస్తున్నామని ఆర్టీసీ కార్గో అధికారులు చెబుతున్నారు. మొదటి సారి వేలం వేస్తే 50 శాతం, రెండో సారి 80 శాతం, మూడోసారి 90 శాతం డిస్కౌంట్​తో వేలం వేస్తున్నారు. ఈ వేలంలో టీవీలు, మొబైల్స్ వంటివి ఉండడంతో జనాలు ఎగబడి వేలంలో పాల్గొంటున్నారు. జేబీఎస్‌ కార్గోసెంటర్‌ (14వ బస్‌స్టాప్‌) బుధవారం నుంచి మూడు రోజుల పాటు వేలం వేయనున్నట్టు ఆర్టీసీ అసిస్టెంట్​ట్రాఫిక్​ మేనేజర్​(లాజిస్టిక్​) ఇషాక్​బిన్​మహ్మద్​ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..