Grand Son On Will: తాత రాసిన వీలునామాపై మనవడు కోర్డుకు వెళ్లవచ్చా..? చట్టపరంగా ఆస్తి దక్కించుకోవటం ఎలాగో తెలుసుకోండి..

Grand Son On Will: సాధారణంగా కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఆస్తి(Property) విషయాల్లోనే వస్తుంటాయి. అనేక సార్లు అవి కొట్లాటకు, కలహాల వరకు వెళుతుంటాయి. చాలా సార్లు ఆస్తి గొడవలు హత్యలకు కారణమవుతుంటాయి. కానీ వీటిని లీగల్ గా ఎలా పరిష్కరించుకోవాలో, నిపుణుల సూచన ఏమిటో చూడండి.

Grand Son On Will: తాత రాసిన వీలునామాపై మనవడు కోర్డుకు వెళ్లవచ్చా..? చట్టపరంగా ఆస్తి దక్కించుకోవటం ఎలాగో తెలుసుకోండి..
Last Will
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 02, 2022 | 9:07 AM

Grand Son On Will: సాధారణంగా కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఆస్తి(Property) విషయాల్లోనే వస్తుంటాయి. అనేక సార్లు అవి కొట్లాటకు, కలహాల వరకు వెళుతుంటాయి. చాలా సార్లు ఆస్తి గొడవలు హత్యలకు కారణమవుతుంటాయి. కానీ వీటిని లీగల్ గా ఎలా పరిష్కరించుకోవాలో, నిపుణుల సూచన ఏమిటో చూడండి. తాతతో(Grand father) బలవంతగా వీలునామా రాయిస్తే.. దానిపై మనవడు కోర్టుకు వెళ్లవచ్చా. అసలు తాత వీలునామాపై మనవడికి ఎలాంటి హక్కు ఉంటుందో తెలుసుకుందాం రండి.. ముందుగా ఈ విషయంలో తాత ఆస్తి వీలునామాపై వారసుడైన కొడుకు లేదా కూతురు.. దానిని ఛాలెంజ్ చేస్తూ లీగల్ గా ప్రొసీడ్ అవ్వవచ్చు. కేవలం ఇతర వారసులకు ఎక్కువ ఆస్తి ఇచ్చారనే కారణం మీద.. సదరు వారసుడు వీలునామాను పక్కన పెట్టాలని కోరటం లేదా ఆ వీలునామా చెల్లదని ప్రకటించాలని అభ్యర్థించటం సరైనది కాదు.

ఈ వీలునామాను(will) పక్కన పెట్టడానికి దానిని బలవంతగా రాయించినప్పుడు చేయవచ్చు. దీనికి తోడు వీలునామా విషయంలో ఏదైనా ఫ్రాడ్ చేసినట్లు, స్వార్థపూరిత కారణం దాగి ఉన్నట్లయితే దానిని పక్కన పెట్టవచ్చు. వీలునామా రాసే వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైనా వారసుడు తనకు అనుకూలంగా దానిని రాయించే ప్రయత్నం చేసినప్పుడు దానిని చట్టపరంగా నిలుపుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు వీలునామా రాసే వ్యక్తి ప్రభావితుడు కావటం వల్ల దానిని రాసినట్లు నిరూపించవలసిన బాధ్యత కోర్టును ఆశ్రయించిన వారసుడిపై ఉంటుంది. దానికి సంబంధించి సరైన ఆధారాలను కోర్టుకు ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల తాత రాసిన వీలునామా వ్యవహారంలో ప్రాథమికంగా మనవడికి ఎలాంటి లీగల్ అర్హత ఉండదు.

ఇవీ చదవండి..

Viral Video: హలో మేడం ఇటు చూడు.. ఎంతసేపూ పుస్తకమేనా.. నన్ను పట్టించుకో..

Investment Plan: ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి..

Russia-Ukraine war Effect: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఎంత.. వాణిజ్యంలో రెండు దేశాలు పరస్పరం ఎంతమేర ఆధారపడ్డాయి..