Rohit Sharma Lamborghini: ఖరీదైన కారు కొన్న టీమిండియా సారథి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ లగ్జరీ SUV లాంబోర్గినీ ఉరస్‌ను కొనుగోలు చేశాడు. దీంతో రోహిత్ షెడ్‌లో కొత్తగా ఈ లగ్జరీ కారు వచ్చి చేరింది. ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ GLS 350d, BMW5, BMWX3 ఈ ఆటగాడి చెంత ఉన్నాయి.

Rohit Sharma Lamborghini: ఖరీదైన కారు కొన్న టీమిండియా సారథి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..
Rohit Sharma Lamborghini
Follow us
Venkata Chari

|

Updated on: Mar 02, 2022 | 9:07 AM

Rohit Sharma Lamborghini: తన సీనియర్లు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)లాగే రోహిత్ శర్మకు కూడా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అయితే, తాజాగా లంబోర్ఘిని ఉరస్‌ని కొనుగోలు చేశాడు. కాగా, ఈ కారు కేవలం 3-4 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ కారు టీమ్ ఇండియా జెర్సీతో ఉండడం విశేషం. ఈ లగ్జరీ కారు రూ. 3.15 కోట్లని తెలుస్తోంది. ఇది షేడ్ డార్క్ బ్లూ లేదా బ్లూ ఎలియోస్ రంగులో ఉంది. ఇది టీమ్ ఇండియా జెర్సీ రంగు కూడా. అయితే బ్లూ కలర్ కారు కొనడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు, రోహిత్ షెడ్‌లో BMW M5 రంగు కూడా నీలంగానే ఉంది. ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ GLS 350d, BMW5, BMWX3 కూడా రోహిత్ ఇంట్లో ఉన్నాయి.

లంబోర్ఘిని ఉరస్ 4.4-లీటర్ టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో పనిచేస్తుంది. దీని మోటార్ గరిష్టంగా 641 bhp శక్తిని, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చారు. దీనికి ఆల్ వీల్ డ్రైవ్ ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన SUVలలో ఒకటిగా పేరుగాంచింది. ఇది గరిష్టంగా 305 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకపోవడం గమనార్హం. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియాను ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌గా మార్చాడు. ప్రస్తుతం మొహాలీలో ఉన్న అతను శ్రీలంకతో తొలి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో 100వ టెస్టు కూడా కానుంది.

Also Read: Indian Cricket Team: ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ సిద్ధం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఎప్పుడంటే?

Nicholas Pooran: నికోలస్ పూరన్ 10 సిక్సర్లు కొట్టాడు, 37 బంతుల్లో సెంచరీ చేశాడు, వీడియో చూడండి

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?