72 గంటల పాటు ఏకధాటిగా బ్యాటింగ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన 19 ఏళ్ల భారత క్రికెటర్..

Siddarth Mohite: ప్రస్తుతం ఎక్కువసేపు బ్యాటింగ్ చేసిన రికార్డు భారత ఆటగాడు విరాగ్ మనే పేరిట ఉంది. 2015లో 50 గంటల పాటు బ్యాటింగ్ చేసి ఈ ఘనత సాధించాడు.

72 గంటల పాటు ఏకధాటిగా బ్యాటింగ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన 19 ఏళ్ల భారత క్రికెటర్..
Siddarth Mohite
Follow us

|

Updated on: Mar 02, 2022 | 9:45 AM

Guinness Book Of World Records: ముంబయి యువ క్రికెటర్ సిద్ధార్థ్ మోహితే(Siddarth Mohite) నెట్ సెషన్‌లో క్రీజులో 72 గంటల ఐదు నిమిషాల పాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన రికార్డు(World Record For Batting Longest) సృష్టించాడు. తన ఈ విజయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Record) ద్వారా గుర్తించాలని ఎదురుచూస్తున్నాడు. 19 ఏళ్ల మోహిత గత వారాంతంలో 72 గంటల ఐదు నిమిషాలు బ్యాటింగ్ చేసి, 2015లో స్వదేశీయుడు, పూణె నివాసి అయిన విరాగ్ మానే 50 గంటల రికార్డును అధిగమించాడు.

ఈమేరకు మోహితే మాట్లాడుతూ, ‘నేను చేసిన ప్రయత్నం సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేను భిన్నమైన వ్యక్తి అని ప్రజలకు చూపించాలనుకున్నాను. కోవిడ్-19 తర్వాత లాక్‌డౌన్ కారణంగా, నా కెరీర్‌లో రెండు కీలక సంవత్సరాలు వెళ్లిపోయాయి. ఇది చాలా పెద్ద నష్టం. కాబట్టి నేను వేరే ఏదైనా చేయాలని అనుకున్నాను. అకస్మాత్తుగా నా మదిలో ఈ ఆలోచన వచ్చింది. తర్వాత నేను చాలా అకాడమీలు, కోచ్‌లను సంప్రదించాను’ అని తెలిపాడు.

కోచ్ సహాయంతో.. మోహితే చేసిన ఈ రికార్డు ప్రయత్నంలో అతని కోచ్ జ్వాలా సింగ్ సహాయం చేశాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కోచ్ జ్వాలా సింగ్. ఈమేరకు మోహిత్ మాట్లాడుతూ, ‘అందరూ నన్ను తిరస్కరించారు. ఆ తర్వాత జ్వాలా సర్‌ని కాంటాక్ట్ చేయగా.. ఓకే అన్నారు. అతను నాకు పూర్తిగా మద్దతు ఇచ్చాడు. నాకు అవసరమైన ప్రతిదాన్ని అందించాడు’ అని వెల్లడించాడు.

బౌలర్ల సమూహం మోహితకు మద్దతుగా సీజన్ అంతా అతనితో ఉండిపోయింది. నిబంధనల ప్రకారం, ఒక బ్యాట్స్‌మెన్ గంటలో ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు. మోహిత రికార్డింగ్, సంబంధిత పత్రాలు ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపించారు.

సహాయం ఎందుకు చేశానంటే? మోహితే గురించి జ్వాలా సింగ్ మాట్లాడుతూ, ‘అతను కోవిడ్-19కి ముందు 2019లో MCC ప్రో-40లో భాగమయ్యాడు, ఆపై మహమ్మారి వచ్చి పడింది. అతని ఆట కోసం అతని తల్లి నన్ను సంప్రదించింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ మూతపడ్డాయి. తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేసి దీనిపై మాట్లాడాను. నిజం చెప్పాలంటే, నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, కరోనా కారణంగా చాలా మంది యువ ఆటగాళ్లు తమ మంచి సంవత్సరాలను కోల్పోయారని నాకు తెలుసు. కాబట్టి ఎవరైనా భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటే ఎందుకు చేయకూడదని నేను అనుకున్నాను. కాబట్టి నేను మద్దతు ఇవ్వడానికి అంగీకరించాను’ అని తెలిపాడు.

Also Read: Rohit Sharma Lamborghini: ఖరీదైన కారు కొన్న టీమిండియా సారథి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

Indian Cricket Team: ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ సిద్ధం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఎప్పుడంటే?