AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: విన్‌జో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని.. ఇండియాను గేమింగ్ పవర్‌హౌస్‌గా మార్చేస్తామంటూ ప్రకటన..

వేగవంతమైన వృద్ధి, బ్రాండింగ్ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహేంద్ర సింగ్ ధోని సహాయపడతాడని పేర్కొంది. విన్‌జో తన రాబోయే మల్టీ-ఛానల్, మల్టీ-మోడల్ మార్కెటింగ్‌, బ్రాండింగ్ ప్రచారాలలో ధోని భాగం కానున్నాడు.

MS Dhoni: విన్‌జో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని.. ఇండియాను గేమింగ్ పవర్‌హౌస్‌గా మార్చేస్తామంటూ ప్రకటన..
Mahendra Singh Dhoni
Venkata Chari
|

Updated on: Mar 02, 2022 | 10:39 AM

Share

WinZO Brand Ambassador: భారతదేశపు అతిపెద్ద సోషల్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్(Social Skill Gaming Platform) విన్‌జో.. తన బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)ని నియమించింది. విన్‌జో, 75 మిలియన్లకు పైగా గేమర్స్ ఉన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోని గేమింగ్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు ఎంఎస్డీతో చేతులు కలిపింది. దీంతో సామాజిక/ఇంటరాక్టివ్ గేమింగ్ ను అత్యంత ఇష్టపడే వినోద రూపంగా స్థాపించేందుకు మార్గం సుగమం చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. వేగవంతమైన వృద్ధి, బ్రాండింగ్ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహేంద్ర సింగ్ ధోని సహాయపడతాడని పేర్కొంది. విన్‌జో తన రాబోయే మల్టీ-ఛానల్, మల్టీ-మోడల్ మార్కెటింగ్‌, బ్రాండింగ్ ప్రచారాలలో ధోని భాగం కానున్నాడు. ప్రస్తుతం దీని ప్రొడక్షన్ జరుగుతోంది.

ఈ మేరకు విన్‌జో సంస్త ప్రతినిధులు మాట్లాడుతూ, జార్ఖండ్‌లోని రాంచీ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన ధోని, ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ టైటిల్ విజయాలు అందించాడు. దాంతో ధోని భారత క్రికెట్‌లో తనపేరు లిఖించుకున్నాడు. ఎంఎస్డీ జీవిత ప్రయాణం, విన్‌జో కోర్‌ విలువలు కలిసి పనిచేయబోతున్నాయి. WinZOలో గేమింగ్ దిగ్గజంతో పాటు, ‘ది తలైవా’ కలిసి పనిచేయనున్నారు. దీంతో గ్లోబల్ గేమింగ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం” అని పేర్కొన్నారు.

ఈమేరకు మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ, “గెలుపు అనేది ఎల్లప్పుడూ మనస్తత్వం, వైఖరిపై ఆధారపడి ఉంటుంది. విన్‌జోతో ప్రయాణం చేయడం చాల థ్రిల్లింగ్‌గా ఉంది. నేను ఆసక్తిగల గేమర్‌ అవ్వడంతో, నేను సంస్థ విజన్‌తో బాగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రిలియన్ డాలర్ల పరిశ్రమ నాయకులతో అనుబంధం కలిగి ఉండటానికి నేను సంతోషిస్తున్నాను. విన్‌జోతో కలిసి, మేం ఈ గేమింగ్‌ను భారతీయ బ్రాండ్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడానికి ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు.

విన్‌జో సహ వ్యవస్థాపకుడు పవన్ నందా మాట్లాడుతూ “మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు మా ప్రయాణాన్ని మరింత సులభం చేస్తుంది. అతను భారత కెప్టెన్‌గా క్రికెట్ ప్రపంచంలో గెలవాల్సిన అన్ని టోర్నమెంట్‌లు గెలిచాడు. ధోనితో ప్రయాణం సాగించేందుకు థ్రిల్‌గా ఉన్నాం. గేమ్ ఛేంజర్, కంపోజ్డ్ లీడర్, విజేత అని పేరు తెచ్చుకున్న మిస్టర్ మహేంద్ర సింగ్ ధోనితో భాగస్వామ్యం భారతీయ యువత, విన్‌జో వినియోగదారుల ఆకాంక్షలతో ప్రతిధ్వనిస్తుంది. దీంతో మేం సామాజిక గేమింగ్‌ను వయస్సు, లింగ బేధంతో సంబంధం లేకుండా ఈ దేశంలోని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం” అని పేర్కొన్నాడు.

కాగా, ఈ కంపెనీ స్పోర్ట్స్ బ్రాండ్ భాగస్వామిగా ’83’ చిత్రంతోనే కాకుండా తన అసోసియేషన్‌ను రెండు ప్రధాన స్పోర్ట్స్‌లో స్పాన్సర్‌షిప్‌లను కూడా ప్రకటించింది. వివోతో ప్రో కబడ్డీ లీగ్ (PKL) జట్లు, బెంగాల్ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, అలాగే పాట్నా పైరేట్స్ తో అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది.

Also Read: 72 గంటల పాటు ఏకధాటిగా బ్యాటింగ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన 19 ఏళ్ల భారత క్రికెటర్..

Rohit Sharma Lamborghini: ఖరీదైన కారు కొన్న టీమిండియా సారథి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..