Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: ఫైనాన్స్ బిల్ అంటే ఏమిటో తెలుసా? ఎకనామిక్‌ లీగల్ డాక్యుమెంట్ అంటే ఏమిటి?

బిల్ పేరు వింటే వివిధ రకాల ఖర్చులు గుర్తొస్తాయి. మొదటి తారీఖుతో ఖర్చులు మొదలవుతాయి కిరాణా నుండి పాలు, పేపర్‌ వరకు ప్రభుత్వం ప్రతి యేడాది బడ్జెట్‌లో ఓ..

Budget 2023: ఫైనాన్స్ బిల్ అంటే ఏమిటో తెలుసా? ఎకనామిక్‌ లీగల్ డాక్యుమెంట్ అంటే ఏమిటి?
Finance Bill
Follow us
Subhash Goud

|

Updated on: Jan 25, 2023 | 5:23 PM

బిల్ పేరు వింటే వివిధ రకాల ఖర్చులు గుర్తొస్తాయి. మొదటి తారీఖుతో ఖర్చులు మొదలవుతాయి కిరాణా నుండి పాలు, పేపర్‌ వరకు ప్రభుత్వం ప్రతి యేడాది బడ్జెట్‌లో ఓ బిల్లు తీసుకొస్తుంది. ఈ బిల్లు ద్వారా యేడాది మొత్తం ప్రజల నుండి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తారు. అదే ఫైనాన్స్‌ బిల్లు. పార్లమెంట్‌లో బిల్లు ప్రస్తావన వస్తే చట్టం గురించి చర్చ జరుగుతోందని భావించాలి. బడ్జెట్ ఆర్థిక వ్యవస్థలో ముడిపడి ఉంటుంది. ఆర్థిక సర్వే రిపోర్ట్ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టినపుడు చాలా అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వం వివిధ రకాల ఖర్చులను వివరిస్తుంది. ఈ ఖర్చులకు నిధుల సమీకరణ కోసం ఫైనాన్స్‌ బిల్లు తీసుకొస్తారు. ఫైనాన్స్‌ బిల్లులో నిధుల సర్దుబాటుకు అవసరమైన చట్ట సవరణలకు ప్రతిపాదనలు ఉంటాయి. ప్రభుత్వ ఖర్చులను సర్దుబాటు చేసేందుకు చేసే చట్ట సవరణల బిల్లును ఫైనాన్స్‌ బిల్‌ అంటారు. ఫైనాన్స్‌ బిల్‌ని మనీ బిల్ అంటారు.

మనీ, ఫైనాన్స్‌ రెండు వేర్వేరు కాన్సెప్ట్‌ భావనలు

ఓ మొబైల్ కొనేందుకు రూ 20 వేల నగదు మనీ అవసరం ఉంది. ఆ రూ 20 వేలు ఎలా సమకూరతాయి ఎవరైనా క్యాష్‌ ఇస్తారా? ఫైనాన్స్‌ చేస్తారా? బడ్జెట్‌లో ఫలానా మొత్తం రక్షణ రంగంలో ప్రభుత్వం ఖర్చు చేయాలని ఉంటుంది. దీనికి ఫైనాన్స్‌ ఎక్కడ నుండి వస్తుంది. ఆదాయపు పన్ను నుండి ఎంత, కస్టమ్స్‌ నుండి ఎంత, వస్తుందనేది ఫైనాన్స్‌ బిల్‌లో లెక్క తెలుస్తుంది. ఫైనాన్స్‌ బిల్‌ని రాజ్యాంగం దృష్టికోణంలో మనీ బిల్ అని అంటాం.

పార్లమెంట్‌లో లోక్ సభ, రాజ్యసభ రెండు విభాగాలు:

మనీ బిల్ ను లోక్‌ సభలో ప్రవేశ పెడితే రాజ్య సభ దానిని తిరస్కరించలేదు, మార్చలేదు. అంటే ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేక పోయినా, కేవలం లోక్‌ సభలో మెజార్టీ ఉంటే మనీ బిల్లు రాజ్యసభ నుండి తిరిగి వస్తుందనే ఎలాంటి భయం లేకుండా ప్రభుత్వం మనీ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగం తయారు చేసేవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. ఒకవేళ మనీ బిల్లు లోక్‌సభలో వీగిపోతే, ఆ ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినట్లే. మనీ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందితే సరిపోతుంది. రాజ్యసభలో మనీ బిల్లు పై చర్చ జరగచ్చు, కానీ రాజ్య సభ దానిని తిరస్కరించలేదు. మార్పులు చేయజాలదు. ఫైనాన్స్‌ బిల్‌ని మనీ బిల్లుగా భావిస్తూ కేవలం లోక్‌సభ ఆమోదం మాత్రమే అవసరమయ్యేలా రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్తలు పాటించారు.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ ఆర్థిక అంశాలకు సంబంధించినది. ఇందులో చట్టాలను మార్చే అంశం ఎందుకు వచ్చింది? దేశంలో ప్రతిది చట్టాల ప్రకారం జరుగుతుంది. ప్రభుత్వం, గూండా మధ్య తేడా ఉంటుంది. గూండా కత్తి లేదా రివాల్వర్ తో బెదిరించి డబ్బు దోచుకుంటాడు. ప్రభుత్వం చట్టాలను చూపించి ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. గత యేడాది మీరు 20 శాతం ఆదాయపు పన్ను చెల్లించి ఉండవచ్చు. ఈ సారి మీరు 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలని ప్రభుత్వం చెప్పవచ్చు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చట్టసవరణ చేయాలి. కస్టమ్స్‌ రేటు, సెస్‌ పెంచాలంటే ఆ యాక్ట్‌ లను మార్చాలి. బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా చట్టంపై పడే ప్రభావాలన్నీ ఫైనాన్స్‌ బిల్‌లో పెడతారు. ఒక రకంగా ఫైనాన్స్‌ బిల్లు చట్టబద్ధమైన డాక్యుమెంట్.

బడ్జెట్ ఆర్థిక డాక్యుమెంటా? లేక చట్టబద్ధమైన లీగల్‌ డాక్యుమెంటా?

బడ్జెట్‌లో చాలా డాక్యుమెంట్స్‌ ఉంటాయి. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఉన్న వివరాలను ఆర్థిక డాక్యుమెంట్ అనవచ్చు. బడ్జెట్‌లోని ఫైనాన్స్‌ బిల్లు విభాగంలో చట్ట సవరణలు ఉంటాయి. దీన్ని లీగల్‌ డాక్యుమెంట్ అంటారు. బడ్జెట్ సమగ్ర కాపీని ఎకనామిక్‌ లీగల్ డాక్యుమెంట్ అనవచ్చు. దేశంలో ప్రతిది చట్టాల ప్రకారం జరుగుతుంది. గతంలో ఇంట్లో రేడియో ట్రాన్సిస్టర్‌ వాడేందుకు ప్రభుత్వం నుండి లైసెన్స్‌ అవసరమయ్యేది. ఆ లైసెన్స్‌ ఫీజ్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. కాల క్రమేణా ఎకనామిక్‌ లిబరలైజేషన్‌ ఆర్థిక సరళీకరణతో ఆ లైసెన్సుల విధానం కనుమరుగైంది. ఏ ప్రభుత్వం చట్ట సవరణ చేసినా దాని ప్రభావం ప్రభుత్వంపై ఉంటుంది. ఈ చట్ట సవరణలన్నీ ఫైనాన్స్‌ బిల్లులో ఉంటాయి. బడ్జెట్‌ను అర్థం చేసుకునేందుకు రాజ్యాంగం, చట్టం పై కొంత అవగాహనతో పాటు ఆర్థిక శాస్త్రం పై పరిపూర్ణ అవగాహన అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి