Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు!

దేశంలో వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల..

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు!
అంటే సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
Follow us
Subhash Goud

|

Updated on: Jan 25, 2023 | 11:11 AM

దేశంలో వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణ పొందుతోంది. కానీ టికెట్‌ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా.. తక్కవ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇటీవల సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలో మరికొన్ని రైళ్లు ప్రారంభం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో మరో మూడు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని కాచిగూడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు, తెలంగాణలోని సికింద్రాబాద్‌ నుంచి ఆంద్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని పుణే వరకు కొత్త వందే భారత్‌ సర్వీలను నడిపేందుకు పరిశీలిస్తున్నారు రైల్వే అధికారులు.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో, ఆంధ్రప్రదేశ్‌లో లో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ తన మిషన్‌ సౌత్‌ కింద 2024లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాధి రాష్ట్రాల్లో తన పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించింది. రైల్వే ఈ ఏడాది నవంబర్‌లో చెన్నై-బెంగళూరు-మైసూర్‌ మార్గంలో దక్షిణ భారతదేశపు మొట్ట మొదటి వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్ రైలులు ప్రారంభించింది.

ఇటీవల ప్రారంభించిన సికింద్రాబాద్‌-వైజాగ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు తెలిపారు. వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్‌లలో కనీసం ఒక కోచింగ్ డిపోలో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే డివిజన్‌లను కోరినట్లు అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని యోచిస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతానికి, నాగ్‌పూర్-బిలాస్‌పూర్, ఢిల్లీ-వారణాసి, గాంధీనగర్-ముంబై, చెన్నై-మైసూరుతో సహా వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఫ్లాగ్‌షిప్ మేక్-ఇన్-ఇండియా ఇనిషియేటివ్ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తయారు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి