BSNL Plans: బీఎస్‌ఎన్‌ఎల్ అతి చౌకైన ప్లాన్.. డైలీ 1GB డేటా.. అపరిమిత కాలింగ్..
BSNL Plans:ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్లని ప్రకటిస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ వంటి
BSNL Plans:ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్లని ప్రకటిస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ వంటి వాటితో పోల్చుకుంటే ధర తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. దాదాపు అన్ని రేంజ్‌ల్లో మంచి ప్రయోజనాలను అందిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను పెంచడంతో చాలామంది ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త కొత్త ఆఫర్లని ప్రకటిస్తుంది. తాజాగా రూ.18 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులకు 2 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. డేటా గురించి చెప్పాలంటే రోజు 1GB డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం 2GB డేటాను పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 80kbpsకి పడిపోతుంది.
BSNL రూ.29 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 5 రోజుల వ్యాలిడిటి ఇస్తారు. అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు 1GB డేటా అందిస్తుంది.
BSNL రూ.37 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటా ఇస్తుంది. 18 రోజులు వ్యాలిడిటీ. ఈ ప్లాన్‌లో మొత్తం 36GB డేటా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. రోజు 100 SMSలు కూడా ఉచితంగా లభిస్తాయి.
BSNL STV 49 Planతో మంచి బెనిఫిట్స్ అందిస్తోంది. 24 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా, 100 నిమిషాల వాయిస్ కాల్స్ వస్తాయి. మొబైల్ తక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే BSNL STV 99 Plan తో రీచార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కాలపరిమితి 22రోజులు. అయితే ఇందులో డేటా లభించదు. BSNL STV 118 Planతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 0.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.