AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చి 31లోపు ఈ 5 పనులు పూర్తి చేయండి.. లేదంటే భారీ నష్టం..!

Income Tax: ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ పరిస్థితిలో ఆదాయపు పన్నుకు సంబంధించిన అన్ని పనులను 31 మార్చి 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఏదైనా కొత్త ప్లాన్ ప్రారంభించడానికి

మార్చి 31లోపు ఈ 5 పనులు పూర్తి చేయండి.. లేదంటే భారీ నష్టం..!
uppula Raju
|

Updated on: Mar 16, 2022 | 11:14 PM

Share

Income Tax: త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అందుకే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కి సంబంధించి ఈ ఐదు పనులని పూర్తి చేస్తే మంచిది. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందులో మొదటది మార్చి 31, 2022లోపు 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని తప్పనిసరిగా ఫైల్ చేయాలి. సవరించిన ITRని కూడా ఈ తేదీ వరకు ఫైల్ చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకోండి. అలాగే రెండోది ఆదాయపు పన్నులో మినహాయింపు పొందడానికి మార్చి 31లోపు పెట్టుబడి పెడితే మంచిది. అంటే మీరు పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీకు పన్ను చెల్లింపులో సహాయపడుతుంది. ఇందులో పిపిఎఫ్, సుకన్య సమృద్ధి వంటి చిన్న పొదుపు పథకాలు ఉన్నాయి. మీరు ఎల్‌ఐసి వాయిదా చెల్లించడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇతర ప్రయోజనాలను పొందేందుకు కూడా మార్చి 31 చివరి తేదీ.

ఆదాయపు పన్ను చట్టం 208 ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ పన్ను కలిగిన చెల్లింపుదారులు ముందస్తు పన్ను చెల్లించవచ్చు. ఈ ప్రక్రియలో మీరు 4 వాయిదాలలో పన్ను చెల్లించవచ్చు. అలాగే ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31. లేదంటే మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగవు. పన్నులు కూడా కట్టలేరు. భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇంకా బ్యాంక్ ఖాతా KYC చేయకుంటే ఆర్థిక సంవత్సరం చివరి రోజులోపు కచ్చితంగా చేయండి. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ తేదీని పొడిగించిన సంగతి తెలిసిందే.

Viral Video: ఈ జామపండ్లు అమ్మే వ్యక్తి పాట ఫేమస్‌.. మరో భుబన్ బద్యాకర్ అవుతాడా ఏంది..!

Funny Video: తలకాయ పగిలే స్టంట్‌ అవసరమా.. మీరు ట్రై చేయకండి సుమా..!

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!