ప్రతి నెలా రూ.4,500 పెట్టుబడి పెడితే.. నెలకి రూ. 51,000 పెన్షన్..!

NPS Investment: చాలామంది ఉద్యోగులు కొన్ని తప్పులు చేస్తారు. అందులో ఒకటి రిటైర్మెంట్‌ తర్వాత జీవితం గురించి ఆలోచించకపోవడం. దీంతో చివరి వయసులో చాలా ఆర్థిక సమస్యలని

ప్రతి నెలా రూ.4,500 పెట్టుబడి పెడితే.. నెలకి రూ. 51,000 పెన్షన్..!
Money
Follow us

|

Updated on: Mar 16, 2022 | 5:55 AM

NPS Investment: చాలామంది ఉద్యోగులు కొన్ని తప్పులు చేస్తారు. అందులో ఒకటి రిటైర్మెంట్‌ తర్వాత జీవితం గురించి ఆలోచించకపోవడం. దీంతో చివరి వయసులో చాలా ఆర్థిక సమస్యలని ఎదుర్కొంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేయాలి. అందుకోసం ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్‌ తర్వాత ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పథకంలో మీరు ప్రతి నెలా కేవలం రూ.4,500 పెట్టుబడి పెడితే మీకు నెలకు రూ.51,848 పెన్షన్ లభిస్తుంది. నిజానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వ పథకం. దీని కింద పెట్టుబడిదారుడి సగటు వయస్సు 21 సంవత్సరాలు. అప్పటి నుంచి 60 సంవత్సరాల వరకు నెలకి రూ. 4,500 పెట్టుబడి పెట్టాలి. మొత్తం 39 సంవత్సరాలు ఏడాదికి 54000 పెట్టుబడి పెడతారు. ఈ 39 సంవత్సరాల అమౌంట్‌ మొత్తం రూ.21.06 లక్షలు అవుతుంది. దీనిపై 10 శాతం రాబడి ఉంటే మెచ్యూరిటీపై రూ. 2.59 కోట్ల ఫండ్‌ క్రియేట్‌ అవుతుంది. అంటే రిటైరయ్యాక నెలకు దాదాపు రూ.51,848 పెన్షన్ లభిస్తుంది. ఈ మొత్తం ఎక్కువ లేదా కొంచెం తక్కువ కావచ్చు. ఇది కాకుండా ఈ పథకంలో పన్ను మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఎన్‌పిఎస్‌పై ఆదాయపు పన్ను సెక్షన్ 80 సిసిడి (1), 80 సిసిడి (1బి), 80 సిసిడి (2) కింద మీరు పన్ను రాయితీ పొందుతారు. అంటే దాదాపు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 2 లక్షల మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

NPS ఖాతాని ఇలా ఓపెన్ చేయండి..

1. NPS ఖాతాను తెరవడానికి enps.nsdl.com/eNPS లేదా http://Nps.karvy.comవెళ్లి, కొత్త నమోదుపై క్లిక్ చేయండి.

2. అన్ని వివరాలను నింపిన తర్వాత మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానిని ధ్రువీకరించండి. బ్యాంక్ ఖాతా వివరాలను ఎంటర్ చేయండి. మీ పోర్ట్‌ఫోలియో ఫండ్‌ని ఎంచుకోండి.

3. వివరాలు నింపాల్సిన బ్యాంకు ఖాతాలో రద్దు చేయబడిన చెక్కును అందించాలి. అంతే కాకుండా ఫొటో, సంతకం కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు చేసిన తర్వాత మీ శాశ్వత పదవీ విరమణ ఖాతా (PRN) నంబర్ జనరేట్ అవుతుంది. మీరు చెల్లింపు రశీదు కూడా పొందుతారు.

SBI PO Final Result 2022: ఎస్బీఐ పీవో రిక్రూట్‌మెంట్‌ ఫైనల్‌ రిజల్ట్ విడుదల.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..!

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

Viral Video: ఈ జామపండ్లు అమ్మే వ్యక్తి పాట ఫేమస్‌.. మరో భుబన్ బద్యాకర్ అవుతాడా ఏంది..!