IRCTCలో తత్కాల్ రైలు టిక్కెట్‌ను బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే టికెట్స్ వెంటనే కన్ఫార్మ్ అవుతాయి..
చివరి క్షణంలో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి వస్తుంది. టిక్కెట్లు అందుబాటులో లేకుంటే కన్ఫర్మ్ టికెట్ పొందడానికి తత్కాల్ ఉత్తమ ఎంపిక. ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేయాలి.
Tatkal Train Ticket Booking: రైలు ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో రిజర్వేషన్ టికెట్లు దొరకడం అంత సులభం కాదు. సరైన సమయంలో టికెట్లు లభించకపోతే.. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో తత్కాల్ టికెట్లను ఎలా బుక్ చేయాలో తెలియక తికమకపడుతుంటారు. రైలు బయలుదేరే ఒకరోజు ముందు తాత్కల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సందర్భంలో.. మీరూ IRCTCలో తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా..? ఈ విషయాలను గమనించండి. చాలా సార్లు చివరి క్షణంలో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి వస్తుంది. టిక్కెట్లు అందుబాటులో లేకుంటే కన్ఫర్మ్ టికెట్ పొందడానికి తత్కాల్ ఉత్తమ ఎంపిక. ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేయాలి. 3AC, అంతకంటే ఎక్కువ తరగతికి బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే స్లీపర్ తరగతికి బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇలాంటి క్రమంలో IRCTC లో ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేస్తున్నట్లయితే దాన్ని వేగంగా బుక్ చేసుకోవడానికి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో కొన్ని సులభమైన చిట్కాలతో తత్కాల్ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అవేంటో చూడండి..
IRCTCలో తత్కాల్ టిక్కెట్‌ను వేగంగా బుక్ చేసుకోవడానికి చేయవలసినవి..
1. IRCTCలో తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేయడానికి మీరు తప్పనిసరిగా IRCTC ఖాతాను కలిగి ఉండాలి. ఐడీ లేకుంటే https://www.irctc.co.in వెబ్‌సైట్ లేదా IRCTC యాప్‌ని సందర్శించడం ద్వారా ఖాతాను సృష్టించవచ్చు.
2. ఖాతాను సృష్టించిన తర్వాత మాస్టర్ జాబితాను సృష్టించండి. మై ప్రొఫైల్ విభాగంలో మాస్టర్ జాబితా ఎంపిక చేసుకోవాలి. దీనిలో పేరు, వయస్సు, లింగం, జనన తేదీ, ఆహార ప్రాధాన్యత, సీనియర్ సిటిజన్, ID కార్డ్ రకం, ప్రయాణీకుల ID కార్డ్ నంబర్ వంటి వివరాలను పూరించండి.
3. మాస్టర్ జాబితాలో ప్యాసింజర్ వివరాలను జోడించండి. జాబితాలో గరిష్టంగా 20 మంది ప్రయాణికులను ఎంటర్ చేయవచ్చు.
4. ఇప్పుడు, మై ప్రొఫైల్ డ్రాప్ డౌన్‌లో ప్రయాణ జాబితాను రూపొందించండి. మాస్టర్ జాబితా నుంచి ప్రయాణీకుడి పేరును ఎంచుకోండి. ఇప్పుడు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లే..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం ఎలా?
- 3AC లేదా అంతకంటే ఎక్కువ తరగతికి తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌కి ఉదయం 9.57 గంటలకు, స్లీపర్ క్లాస్ లాగిన్ కోసం 10.57 గంటలకు లాగిన్ అవ్వండి.
- తర్వాత, ప్లాన్ మై జర్నీ ట్యాబ్ కింద స్టేషన్ల పేర్లను ఎంచుకుని, మీ ప్రయాణ తేదీని ఎంచుకుని చివరకు సమర్పించండి.
- ఇప్పుడు సూచించిన రైలు జాబితా నుంచి మీరు ప్రయాణించాలనుకునే రైలును ఎంచుకోండి. కోటా కూడా ఎంచుకోవచ్చు.. జనరల్, ప్రీమియం తత్కాల్, లేడీస్, తత్కాల్.
- తర్వాత మీరు టిక్కెట్‌ను బుక్ చేయాలనుకుంటున్న కోచ్‌లను ఎంచుకుని, ప్రయాణికుల వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు, మాస్టర్ జాబితా మీ సమయాన్ని ఆదా చేసేందుకు ఇక్కడ సహాయం చేస్తుంది.
- మీరు 1-2 మంది ప్రయాణీకుల కోసం టిక్కెట్లు బుక్ చేయాలనుకుంటే మాస్టర్స్ జాబితా నుంచి ప్రయాణీకుల వివరాలను ఎంచుకోండి. కానీ ప్రయాణీకుల సంఖ్య అంతకంటే ఎక్కువ ఉంటే, ప్రయాణ జాబితా నుంచి ప్రయాణీకుల వివరాలను ఎంచుకోండి.
- పూర్తయిన తర్వాత, చెల్లింపు చేయడానికి కొనసాగండి. ఒకసారి పూర్తి చేసిన తర్వాత, మీరు మై బుకింగ్ ట్యాబ్‌లో బుక్ చేసిన టిక్కెట్‌లను చూడవచ్చు.
- ఇలా చేయడం ద్వారా తత్కాల్ టికెట్లను వేగంగా పొందవచ్చు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి