LPG Cylinder Booking: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకోండిలా..!
LPG Cylinder Booking: ఒకప్పుడు ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవాలంటే సంబంధిత గ్యాస్ సిలిండర్ కార్యాలయానికి వెళ్లి బుక్ చేసుకోవాల్సి వచ్చేది. లేకపోతే సిలిండర్ దొరికేది..
LPG Cylinder Booking: ఒకప్పుడు ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవాలంటే సంబంధిత గ్యాస్ సిలిండర్ కార్యాలయానికి వెళ్లి బుక్ చేసుకోవాల్సి వచ్చేది. లేకపోతే సిలిండర్ దొరికేది కాదు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్యాస్ బుకింగ్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. చాలా సులభతరమైపోయింది. గత ఏడాది గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల సౌకర్యం కోసం అనేక ఆన్‌లైన్ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మీరు గ్యాస్ ఏజన్సీ లేదా డీలర్‌ను సంప్రదించడం ద్వారా లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి గ్యాస్ సిలిండర్‌లను బుక్ చేసుకోవచ్చు. లేదా కంపెనీ వాట్సాప్ నెంబర్‌కు సందేశం పంపించడం ద్వారా కూడా ఎల్‌పీజీ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఇండెన్, హెచ్‌పీ, ఇండియన్ గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్లను ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.
ఇండెన్ కస్టమర్లు 7718955555 నెంబర్‌కు కాల్ చేసి ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్‌లో 7588888824 కు REFILL టైప్ చేయడం ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 9222201122 కు వాట్సాప్‌లో సందేశం పంపడం ద్వారా హెచ్‌పి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. BOOK అని టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈ నంబర్‌కు పంపండి. ఈ సంఖ్య మీకు అనేక ఇతర సేవా వివరాలను కూడా అందిస్తుంది. మీ ఎల్‌పిజి కోటా, ఎల్‌పిజి ఐడి, ఎల్‌పిజి సబ్సిడీ మొదలైన వాటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.
భారత్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా ఎల్పిజి సిలిండర్లను ఎలా బుక్ చేస్తారు?
భారత్ గ్యాస్ కస్టమర్లు బుక్ లేదా టైప్ 1 అని టైప్ చేసి తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1800224344 కు మెసేజ్ పంపాలి. దీని తరువాత, మీ బుకింగ్ అభ్యర్థనను గ్యాస్ ఏజెన్సీ అంగీకరిస్తుంది.
ఇవీ చదవండి: కూతురికి ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇస్తే పన్ను వర్తిస్తుందా..? దానిపై అద్దె రూపంలో వచ్చే ఆదాయం సంగతేంటి..?
SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..
Electric Bike: ఈ బైక్ 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్