SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..
SBI Interest Rates: కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు.. వైరస్ ప్రతి ఒక్కరిపై దెబ్బకొట్టింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
SBI Interest Rates:కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు.. వైరస్ ప్రతి ఒక్కరిపై దెబ్బకొట్టింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు షాకిచ్చింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు ఎస్‌బీఐ హోమ్ లోన్లపై వడ్డీ రేటు 6.70 శాతం ఉంది. ఇప్పుడు అది 6.95 శాతానికి పెరిగింది. ఈ వడ్డీరేటులో పెరుగుదల ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే మార్చి నెలలో వడ్డీ రేట్లపై ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 6.70 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్లను అందించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు కొనసాగింది. ఇక ఇప్పుడు ఆ లోన్లపై వడ్డీ రేట్లను పెంచేసింది. రుణాలపై వడ్డీ రేటు 25 బేసిక్ పాయింట్లు పెంచింది. దీంతో కొత్త రేటు ఇప్పుడు 6.95 శాతానికి చేరింది. ఇదిలా ఉంటే గృహ రుణాలపై విధించే ఏకీకతృ ప్రాసెసింగ్ ఫీజు కూడా రుణ మొత్తంలో 0.40శాతం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో ఉంటుంది.
మొత్తం ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ.10 వేలు, గరిష్టంగా రూ.30 వేలు ప్లస్ జీఎస్టీ అవుతుంది. గత నెలలో ఎస్బీఐ మార్చి 31 లోగా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచడంతో కస్టమర్లకు షాకిచ్చినట్లయింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇవీ చదవండి: IRCTC: ఐఆర్‌సీటీసీ అదరిపోయే ఆరు రోజుల టూర్ ప్యాకేజీ.. ఈ అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు
Electric Bike: ఈ బైక్ 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్