- Telugu News Photo Gallery Business photos Suzuki introducing new hayabusa 2021 bike in indian market this year here the price and specifications of new bike coming in july
Suzuki Hayabusa: సుజుకీ నుంచి మరో క్రేజీ బైక్.. ఈ ఏడాదిలో రానున్న హయాబుసా.. ధర ఎంతో తెలిస్తే షాక్..
Suzuki Hayabusa: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న సుజుకీ హయాబుసా నుంచి మరో కొత్త బైక్ రానుంది. 2021 సుజుకీ హయాబుసా కొత్త ఎడిషన్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేసే అవకాశాలున్నాయి...
Updated on: Apr 06, 2021 | 11:16 AM

వాహన తయారీ రంగంలో సుజుకీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన హయాబుసా టూ వీలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రపంచవ్యాప్తంగా సుజుకీ హయాబుసా బండికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ క్రమంలోనే తాజాగా 2021 సుజుకీ హయాబుసా రానుంది.

ఈ ఏడాదిలో భారత మార్కెట్లోకి ఈ సెన్సేషన్ బైక్ రానుంది. దీన్ని బీఎస్6 ఇంజన్‌తో రూపొందించారు.

ఈ బైక్ 9700 ఆర్‌పీఎమ్ వద్ద 187 బీహెచ్‌పీ విడుదల చేస్తుంది. గరిష్టంగా 299 కి.మీల వేగంతో దూసుకెళ్లగలదు.

పవర్ మోడ్ సెలక్టర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ సిస్టం, యాంటీ తిఫ్ట్ కంట్రోల్ సిస్టం, మోషన్ ట్రాక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బై డైరెక్షనల్ షిప్ట్ సిస్టం వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్ సొంతం.

ఈ బైక్ ఎక్స్ షోరుమ్ ధర ఏకంగా అక్షరాల 20 లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా. జూలైలో ఈ బైక్ వచ్చే అవకాశాలున్నాయి.

ఇక ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలంటే ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు టోకెన్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది.





























