ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు 7 శాతం కంటే తక్కువ వడ్డీతో ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తున్నాయి. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు వరుసగా 6.8 శాతం, 6.85 శాతం వడ్డీతో విద్యారుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఇది పది శాతం వరకు ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు 9.55 శాతం, 9.70శాతం, 10.50 శాతం వడ్డీ విధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అతి తక్కువగా 6.8 శాతంతో ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తుండగా, ఇండియన్ బ్యాంకు అత్యధికంగా 7.15 శాతం వడ్డీ అందిస్తోంది.