కూతురికి ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తే పన్ను వర్తిస్తుందా..? దానిపై అద్దె రూపంలో వచ్చే ఆదాయం సంగతేంటి..?

ఆస్తుల అంశాలలో చెల్లించే ట్యాక్స్‌ విషయాలలో ఎన్నో అనుమానాలు తలెత్తుతుంటాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ పలు నియమ నిబంధనలు విధిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం...

కూతురికి ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తే పన్ను వర్తిస్తుందా..? దానిపై అద్దె రూపంలో వచ్చే ఆదాయం సంగతేంటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 10, 2021 | 12:39 PM

ఆస్తుల అంశాలలో చెల్లించే ట్యాక్స్‌ విషయాలలో ఎన్నో అనుమానాలు తలెత్తుతుంటాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ పలు నియమ నిబంధనలు విధిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ట్యాక్స్‌ నిబంధనల్లో పలు మార్పులు చేర్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓ కుటుంబానికి ఇస్తులపై చెల్లించే పన్ను విషయాలలో అవగాహణ కలిగి ఉండాలి. ఓ తండ్రి తన కుమార్తెకు ప్లాట్‌ను బహుమతిగా ఇస్తే పన్ను వర్తిస్తుందా..? ఒక వేళ వర్తిస్తే ఎవరు దానిని భరించాల్సి ఉంటుంది. దానిపై అద్దె రూపంలో సమకూరే ఆదాయంపై పన్ను సంగతేంటి.? ఒక వేళ ఆ ప్లాట్‌ను అమ్మితే వచ్చే మూలధన రాబడిపై పన్నులు వర్తిస్తాయా..? ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి పన్నుకు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలిసి ఉండవు. అయితే ఇలాంటి సందేహాలు సహజం అయినా.. సరైన సమాధానం తెలిసి ఉండదు. ఇక అంశంపై నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

సాధారణంగా బహుమానం ఇచ్చేవారు దాని విలువపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఆ బహుమానాన్ని స్వీకరించే వారు మాత్రం కొన్ని సందర్భాల్లో ఆ విలువను తమ ఆదాయాల్లో కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒక ఏడాది కాలంలో అందుకున్న బహుమానాల విలువ రూ.50 వేలు దాటకపోతే దానిపై గ్రహీత ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ రూ.50 వేలు దాటితే మాత్రం తప్పకుండా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఓ మినహాయింపు ఉంటుంది. బహుమానం ఇచ్చిన వారు సమీప బంధువులైతే (తండ్రి సహా) ఎలాంటి పరిమితి లేకుండా బహుమతి మొత్తం విలువపై పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఓ తండ్రి తన కూతురికి ప్లాట్‌ను బహుమానంగా ఇస్తే ఎవరూ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఇక బహుమానం ద్వారా పొందిన ఆస్తిపై సంపాదించిన లేదా లభించే ఆదాయంపై గ్రహీత మేజర్‌ అయితే తప్పకుండా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ రాబడిని తండ్రి ఆదాయంతో కలిపితే క్లబ్బింగ్‌ నిబంధనలు వర్తించనున్నాయి.

అలాగే కుమార్తె మైనర్‌ అయినా క్లబ్బింగ్‌ నిబంధనలే వర్తిస్తాయి. తండ్రి ఆదాయంతో కలిపే రాబడిపై రూ.1,500 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక కూతురు మేజర్‌ అయి ఉండి, ఆ ప్లాట్‌ను అమ్మితే మూలధన లాభాలు ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయి. ఒక వేళ మైనర్‌ అయితే మళ్లీ క్లబ్బింగ్‌ నిబంధనలు వర్తిస్తాయి

ఇవీ చదవండి: Bike Discounts: బంపర్‌ ఆఫర్‌.. బైక్‌ కొంటే రూ.50 వేల వరకు తగ్గింపు.. ఏప్రిల్‌ 30 వరకు గడువు

SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్‌..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..

Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !

Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు