Ration Card: రేషన్ కార్డులో తప్పులు సరి చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!

Ration Card Process: రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యావసర వస్తువులు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఇదొక్కటే కాదు.. దీనితో అనేక లాభాలు ఉన్నాయి...

Ration Card: రేషన్ కార్డులో తప్పులు సరి చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!
Ration Card
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 10, 2021 | 1:22 PM

Ration Card Process: రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యావసర వస్తువులు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఇదొక్కటే కాదు.. దీనితో అనేక లాభాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలు పొందాలంటే.. ఈ కార్డు ఉండాల్సిందే.! అందువల్ల, కుటుంబ సభ్యులందరి వివరాలను అందులో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ కొత్త సభ్యుడు మీ ఇంటిలో చేరినట్లయితే, వారి పేరును ఇంటి దగ్గర నుంచి ఇందులో సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఈ స్టెప్స్‌ను ఫాలో అయితే చాలు. ఇవి మాత్రమే కాకుండా.. మీ పేరు, చిరునామాతో సహా మరికొన్ని వివరాలు తప్పుగా రాసి ఉంటే.. వాటిని సైతం ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా మార్చుకోవచ్చు.

ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌కి సమాచారం అందించాల్సి ఉంటుంది…

రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేరును జోడించడానికి, మీరు మీ ఆధార్ కార్డును సవరించాలి. ఉదాహరణకు, ఒక అమ్మాయి వివాహం తర్వాత తన ఇంటిపేరు మార్చుకుంటే, ఆమె తన ఆధార్ కార్డులో తండ్రి స్థానంలో భర్త పేరు జత చేసుకుని కొత్త చిరునామాను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ అనంతరం కొత్త ఆధార్ కార్డు వివరాలను భర్త ప్రాంతంలో ఉన్న ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌కి ఇవ్వాలి. ఆన్‌లైన్ ధృవీకరణ తర్వాత కూడా మీరు కొత్త సభ్యుల పేరును జోడించవచ్చు. ఇందులో, మీరు పాత రేషన్ కార్డు నుండి పేరును తొలగించి, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేయాలంటే.. మీ మొబైల్ నెంబర్ ఈ డాక్యుమెంట్స్ అన్నింటికీ రిజిస్టర్ అయి ఉండాలి.

మొబైల్ నంబర్‌ను ఎలా జోడించాలి…

మొబైల్ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేసి ఉండకపోతే, దాన్ని నమోదు చేయడానికి మీరు https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx ని సందర్శించాలి. ఇక్కడ మీరు అప్‌డేట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. ఇక్కడ, మీ ఇంటి పెద్ద ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రెండవ కాలమ్‌లో రేషన్ కార్డు సంఖ్యను రాయాలి. అలా అక్కడ పేర్కొన్న అంశాలను పూర్తిగా ఫిల్ చేయాలి.

Also Read:

Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.

ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!