China: ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాకు సంస్థకు చైనా షాక్.. భారీ జరిమానా.. ఎందుకంటే..
మార్కెట్ గుత్తాధిపత్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాకు గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించనందుకు గాను ఆ సంస్థకు భారీ జరిమానా విధించింది.
మార్కెట్ గుత్తాధిపత్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాకు గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించనందుకు గాను ఆ సంస్థకు 18.2 బిలియన్ యువాన్ల (2.78 బిలియన్ డాలర్లు) భారీ జరిమానా విధించింది.
చైనా అధికారిక మీడియా జున్హూ శనివారం తన కథనాల్లో అలీబాబా సంస్థ గుత్తాధిపత్యం నిబంధనల దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిపింది. దీనిపై డిసెంబర్ లో దర్యాప్తు ప్రారంభంచినట్టు చెప్పింది. అన్ని విషయాలు పరిశీలించాకా జరిమాణపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తన ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులను విక్రయించాలనుకునే వ్యాపారులను ప్రత్యర్థి ఇ-కామర్స్ సైట్‌ల నుంచి అలీబాబా తప్పించింది అని పేర్కొంది. అలీబాబా సంస్థ 2019లో మొత్తం 455.7 బిలియన్ యువాన్ల మేర లావాదేవీలు జరిపింది. ఆ లావాదేవీలపై నాలుగు శాతం జరిమానా విధించాలని నిర్ణయించినట్టు జిన్హువా పేర్కొంది.
చైనాలో వ్యాపారాలు నిర్వహించే విషయంలో అలీబాబా సహా ఇతర ప్రముఖ టెక్ కంపెనీలు ఆందోళనకు గురిఅవుతున్నాయి. ఇక్కడ సాంకేతికతపై అవగాహన ఉన్న వినియోగదారులు తమ అవసరాల కోసం పెద్దస్థాయిలో ఈ కామర్స్ వేదికలను ఉపయోగించుకుంటుంన్నారు. గతంలో అలీబాబాకు చైనాతో మంచి అనుబంధమే ఉండేది. కానీ, ఇటీవల తలెత్తిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి.
గత సంవత్సరం అక్టోబర్ 24న చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో అలీబాబా సహా వ్యవస్థాపకుడు జాక్ మా విమర్శలు గుప్పించారు. చైనా ర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. దీంతో ఆగ్రహించిన చైనా అలీబాబా సంస్థపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.
చైనా ర్థిక, నియంత్రణ వ్యవస్థ ఆవిష్కరణలను అరికట్టాయని ఆరోపించిన జాక్ మా.. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మరిన్ని చిన్న సంస్థలు, వ్యక్తులకు ఆర్థిక సేవల విస్తరణను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. తరువాత నుంచి అయన దాదాపుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొత్తమ్మీద చైనాకు సలహాలు ఇవ్వబోయిన జాక్ ఇప్పుడు కష్టాల్లో పడిపోయారు.