AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Petrol and Diesel: 50 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందండి.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

Free Petrol-Diesel: దేశ వ్యాప్తంగా నిలకడ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి.

Free Petrol and Diesel: 50 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందండి.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..
Petrol And Diesel
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2021 | 4:03 PM

Share

Free Petrol-Diesel: దేశ వ్యాప్తంగా నిలకడ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు 90-100 మధ్య కొనసాగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 క్రాస్ చేశాయి కూడా. ఇలాంటి తరుణంలో హెచ్‌డిఎఫ్‌సి బంపర్ ఆఫర్ ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి-ఇండియన్ ఆయిల్ క్రిడిట్ కార్డు‌ వినియోగదారులకు దాదాపు 50 లీటర్ల మేర ఇంధనం ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. హెచ్‌డిఎఫ్‌సి-ఐఒసిఎల్ కార్డు ద్వారా ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ బంక్‌లలో చెల్లింపులు జరిపిన ప్రతిసారి కొన్ని పాయింట్లను ఆఫర్‌గా ఇస్తోంది. తద్వారా ఈ కార్డు కలిగిన వినియోగదారులు ప్రతి ఏటా 50 లీటర్ల వరకు ఉచిత ఇంధనాన్ని సంపాదించవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి-ఐఒసిఎల్ క్రెడిట్ కార్డ్ ముఖ్య ప్రయోజనాలు: కార్డ్ హోల్డర్లు వారి మొత్తం ఖర్చులో 5 శాతం ఐఓసిఎల్ కార్డుతో సంపాదించవచ్చు. ఇది మొదటి ఆరు నెలలకు నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్స్ వరకు లభిస్తాయి. ఆ తరువాత ఆరు నెలలకు గరిష్టంగా 150 పాయింట్లు లభిస్తాయి. ఇక ఈ కార్డు కలిగిన వినియోగదారులు కిరాణా షాపింగ్, ఇతర బిల్లుల చెల్లింపులపై 5 శాతం ఫ్యూయల్ పాయింట్స్‌ను పొందవచ్చు. ఇలా గరిష్టంగా నెలకు 100 ఫ్యూయల్ పాయింట్స్‌లోపు పొందే అవకాశం ఉంది. అయితే, కనీసం రూ.150ల లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఈ కార్డు దారులకు 1శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది. ఇలా వచ్చిన ఫ్యూయల్ పాయింట్స్‌తో సదరు కార్డు దారుడు ఏడాదికి 50 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలి?, కార్డ్ రెన్యూవల్ ఛార్జెస్? ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందడానికి రూ.500 నగదుతో పాటు ఇతర ట్యాక్స్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ కార్డ్ కలిగిన వారు సంవత్సరంలో ఈ కార్డును ఉపయోగించి రూ.50 వేలకు పైగా ఖర్చు చేసినట్లయితే.. రెన్యూవల్ ఛార్జీలు మాఫీ చేయడం జరుగుతుంది.

ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఎవరు పొందవచ్చు? 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ వ్యక్తి అయినా ఈ కార్డ్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ బిజినెస్‌ పర్సన్స్ అయితే 65 ఏళ్ల వయసు వరకు ఈ కార్డ్‌ను పొందే అవకాశం ఉంది. కార్డు కావాలనుకునే వారి నెలవారి కనీస ఆదాయం రూ. 12,000 ఉండాలి. ఇక స్వయ ఉపాధి కలిగిన వారైతే.. ఏడాదికి రూ.2 లక్షలకు పైగా టర్నోవర్ చూపించాల్సి ఉంటుంది.

ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఎలా పొందాలి? హెచ్‌డిఎఫ్‌సి-ఐఒసిఎల్ క్రెడిట్ కార్డు పొందడానికి బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా సమీప బ్యాంకు కార్యాలయానికి వెళ్లి ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దేశంలోని వివిధ నగరాల్లో ఎంపిక చేసిన ఇండియన్ ఫ్యూయల్ బంక్స్‌ నుంచి కూడా ఈ కార్డును పొందవచ్చు.

Also read:

China Vaccine: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు

అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్