Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Of Baroda: విద్యార్థులకు ‘బ్రో’ అకౌంట్.. అదిరే ఫీచర్లు.. సూపర్ ప్రయోజనాలు

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించింది. బ్రో(బీఆర్ఓ) సేవింగ్స్ అకౌంట్ పేరిట దీనిని లాంచ్ చేసింది. ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కేవలం విద్యార్థుల కోసమే రూపొందించిన అకౌంట్. 16ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ బ్రో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిలో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

Bank Of Baroda: విద్యార్థులకు ‘బ్రో’ అకౌంట్.. అదిరే ఫీచర్లు.. సూపర్ ప్రయోజనాలు
Student Account
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 22, 2023 | 7:45 PM

మీ పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకు జీరో అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించింది. బ్రో(బీఆర్ఓ) సేవింగ్స్ అకౌంట్ పేరిట దీనిని లాంచ్ చేసింది. ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కేవలం విద్యార్థుల కోసమే రూపొందించిన అకౌంట్. 16ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ బ్రో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిలో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కాంప్లిమెంటరీగా జీవితకాలం వ్యాలిడిటీతో డెబిట్ కార్డు ఇస్తారు. ఇంకా ఈ ప్రత్యేకమైన జీరో అకౌంట్ ఖాతాకు సంబంధించిన ఫీచర్లు, ఖాతా ప్రారంభించే విధానం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సందర్బంగా బ్యాంక్ రిటైల్ లియబిలిటీస్ అండ్ ఎన్ఆర్ఐ చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ బీఓబీ బ్రో సేవింగ్స్ అకౌంట్ యువకులను బ్యాంకింగ్ ప్రపంచానికి పరిచయం చేస్తుందన్నారు. ఇది వారి నిర్దిష్ట బ్యాంకింగ్ అవసరాలను జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పారు. అత్యంత విలువైన ఫీచర్లు, ప్రయోజనాలను అందిస్తుందని వివరించారు. వతను ఆకర్షించడానికి, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక బ్యాంకింగ్ భాగస్వామిగా ఐఐటీ బాంబే, వార్షిక విద్యార్థి ఉత్సవం, ఆసియాలో అతిపెద్ద కళాశాల సాంస్కృతిక ఉత్సవం అయిన మూడ్ ఇండిగో (మూడి)తో జతకట్టింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ హెడ్ వీజీ సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ వేగంగా మారుతున్న ల్యాండ్‌స్కేప్‌లో, బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త తరం కస్టమర్‌లకు సంబంధితంగా, అర్థవంతంగా ఉండేలా అభివృద్ధి చెందుతూ, రూపాంతరం చెందుతూనే ఉందన్నారు. వినియోగదారులతో శాశ్వత సంబంధాలను నిర్మించుకోవడానికి తాము దీర్ఘకాలిక విధానాన్ని తీసుకుంటున్నామన్నారు. మూడ్ ఇండిగోతో మా అనుబంధం ఈ ఫిలాసఫీకి అనుగుణంగా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

బీఓబీ బ్రో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఫీచర్లు..

  • 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వారికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.
  • ప్రముఖ బ్రాండ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లతో జీవితకాల ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అందజేస్తారు.
  • కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ రెండో త్రైమాసికానికి 2 అందుబాటులో ఉంటుంది.
  • రూ. 2 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ అందిస్తారు.
  • ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంది.
  • డిజిటల్ ఛానెల్‌లు, బ్రాంచ్ ద్వారా ఉచిత నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్/యూపీఐ సేవలు పొందొచ్చు.
  • అపరిమిత ఉచిత చెక్ లీవ్‌లు.
  • ఉచిత ఎస్ఎంఎస్/ఇమెయిల్ అలెర్ట్ లు పొందొచ్చు.
  • డీమ్యాట్ ఏఎంసీలో 100% వరకు రాయితీ
  • సున్నా ప్రాసెసింగ్ రుసుముతో విద్యా రుణాలపై రాయితీ వడ్డీ రేట్లు
  • అర్హతకు లోబడి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..