Black Stone: అత్యధిక జీతం తీసుకునేవాళ్లలో ఆయనే తోపు.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..

Black Stone: కంపెనీ సీఈవో(CEO Salary) జీతం ఎంత వరకు ఉండొచ్చు.. సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉండటం సహజం. ఒకవేళ మరి ఎక్కువైతే రూ.500 కోట్ల వరకు ఉండొచ్చు.

Black Stone: అత్యధిక జీతం తీసుకునేవాళ్లలో ఆయనే తోపు.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..
Black Stone CEO
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 09, 2022 | 7:12 AM

Black Stone: కంపెనీ సీఈవో(CEO Salary) జీతం ఎంత వరకు ఉండొచ్చు.. సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉండటం సహజం. ఒకవేళ మరి ఎక్కువైతే రూ.500 కోట్ల వరకు ఉండొచ్చు. కానీ.. ఆ కంపెనీ సీఈవో జీతం వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వక మానదు. ఎందుకంటే ఆయన జీతం రూ.8,500 కోట్లుగా ఉంది. అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా రికార్డును ఆయన బద్దలు కొట్టారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. బ్లాక్‌స్టోన్ ఇంక్‌ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ స్క్వార్జ్మాన్. 2021లో డివిడెంట్లు, వివిధ పరిహారాల కింద 1.1 బిలియన్ డాలర్లను.. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.8,500 కోట్లు. ఇంత మెుత్తంలో జీతం ఎవరైనా ఇంటికి తీసుకెళుతున్నారంటే అది మామూలు విషయం కాదు. స్టీఫెన్ ఇంత శాలరీ తీసుకోవడం ఇదే మెుదటిసారని తెలుస్తోంది.

బ్లాక్‌స్టోన్ ఇన్నెస్ట్ మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఈ కంపెనీ పేరు తెలియని వారు ఉండరంటే అది అతిశయోక్తనే చెప్పుకోవాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది ఈ కంపెనీ. న్యూయార్క్‌కు చెందిన ఈ సంస్థలో స్టీఫెన్‌కు 19 శాతం వాటాలున్నాయి. ఈ వాటాల నుంచి పొందిన డివిడెండ్ల ద్వారా స్టీఫెన్ 2021లో 941.6 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాక.. పరిహారాల రూపంలో మరో 160.3 మిలియన్ డాలర్లు స్టీఫెన్ కంపెనీ నుంచి అందుకున్నారు. 1985లో ఏర్పాటైన ఈ కంపెనీకి స్టీఫెన్ సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. అప్పటి నుంచి సంస్థకు ఆయన సీఈవో హోదాలో కొనసాగుతున్నారు. ప్రెసిడెంట్‌గా జోనథాన్ గ్రేన్ కంపెనీ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం స్టీఫెన్ సంపద 37.3 బిలియన్ డాలర్లుగా ఉంది.

2022లో బ్లాక్‌స్టోన్ కంపెనీ షేర్లు 1.5 శాతం వరకు తగ్గాయి. ఇదే సమయంలో ప్రధాన ఇండెక్స్ ఎస్& పీ 500 8.2 శాతం మేర తగ్గింది. గత 12 నెలల కాలంలో బ్లాక్‌స్టోన్ షేర్లు 80 శాతం వరకు పెరిగాయి. బ్లాక్ స్టోన్ కంపెనీ అమెరికాలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలలోనూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ముగింపు సమయానికి ఆ కంపెనీలో మదుపరుల సంపద విలువ 880.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఇవీ చదవండి..

Kim Jong-un: దూకుడు పెంచిన కిమ్ మామ.. అక్కడ అణు పరీక్షలకు ఏర్పాట్లు..

Steel: భారత్ కు యుద్ధం తెచ్చిన కొత్త అవకాశం.. కానీ దేశీయ వినియోగదారులపై పెరుగుతున్న భారం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?