Maggi: బ్యాచిలర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మీ ఆకలి తీరాలంటే మరింత భారం భరించాల్సిందే..

నెస్లే.. మ్యాగీ తినే వారికి చేదు వార్త చెప్పింది. పెరిగిన ముడి సరుకుల కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది...

Maggi: బ్యాచిలర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మీ ఆకలి తీరాలంటే మరింత భారం భరించాల్సిందే..
Maggi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 15, 2022 | 7:01 PM

చాలా మంది చిన్నారులు న్యూడిల్స్ అంటే ఇష్టపడతారు. ఇక బ్యాచిలర్స్ ఆకలిని క్షణాల్లో తీర్చే ఇన్‌స్టంట్ న్యూడిల్స్ మరింత ప్రియం కానుంది. పెరిగిన ముడి సరుకుల కారణంగా నెస్లే కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాగీ(Maggi) ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెస్లే ఇండియా విడుదల చేసిన సమాచారం ప్రకారం , మ్యాగీ ధరలు 9 నుండి 16% వరకు పెరిగాయి. 140 గ్రాముల మ్యాగీ ప్యాకెట్ ధర రూ.12 నుంచి రూ.14 పెరగనుంది. రూ.96 ప్యాకెట్ ధర రూ.105లకు పెరగనుంది. ఇంతకుముందు దేశంలో అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG ) కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(HUL ) టీ, కాఫీ పౌడర్ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ బ్రూ కాఫీ పౌడర్ ధరను 3-7 శాతం వరకు పెంచింది. తాజ్ మహల్ టీ ధర 3.7-5.8 శాతం పెరిగింది. హెచ్‌యూఎల్ ఫిబ్రవరిలో రెండుసార్లు డిటర్జెంట్ పౌండర్‌, సబ్బుల ధరను పెంచింది. ఫిబ్రవరిలో HUL లైఫ్‌బాయ్, లక్స్, పియర్స్ సబ్బులతో పాటు సర్ఫ్ ఎక్సెల్ మాటిక్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్, డోవ్ బాడీ వాష్ వంటి బ్రాండ్‌ల స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలను మరింత పెంచింది.

ముడి పదార్థల ధర పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు నెస్లే కంపెనీ పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గోధుమల ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. మొక్కజొన్న 8 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అందుకే ధరను పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం రికార్డులను బద్దలు కొట్టింది. టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో సరిగ్గా నెల రోజుల క్రితం అంటే జనవరి నెలలో 12.96 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 2021లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 4.83 శాతం మాత్రమే. డిసెంబర్ 2021లో, టోకు ద్రవ్యోల్బణం రేటు 13.56 శాతంగా ఉంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం వచ్చే నెలలో జరగనుంది. దానికి ముందు మార్చి 16న, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటుకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

Read Also.. Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 709, నిఫ్టీ 208 పాయింట్లు డౌన్..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..