Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 709, నిఫ్టీ 208 పాయింట్లు డౌన్..

వరుస లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. మార్చి 15 యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలతోపాటు..

Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 709, నిఫ్టీ 208 పాయింట్లు డౌన్..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 15, 2022 | 5:42 PM

వరుస లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. మార్చి 15 యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలతోపాటు.. భారత్‌లో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతం పెరిగడం వల్ల సెన్సెక్స్ 709 పాయింట్లు తగ్గి 55,777 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 208 పాయింట్లు క్షీణించి 16,663 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.85 శాతం పడిపోయింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్ 4.07, నిఫ్టీ ఐటీ 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ ఆటో0.57, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.17 శాతం చొప్పున పెరిగాయి. టాటా స్టీల్ షేర్ ధర 5.24 శాతానికి పడిపోయి రూ. 1,229.05 చేరింది. హిందాల్కో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టాల్లో ఉన్నాయి.

Paytm పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ మరో 12.28 శాతం పడిపోయి కనిష్ఠస్థాయి రూ. 592.40ని తాకింది. Paytm పేమెంట్స్ బ్యాంక్‌ కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా RBI నిషేధించిన తర్వాత గత రెండు రోజుల్లో స్టాక్ దాదాపు 25 శాతం పడిపోయింది. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సిఎల్ టెక్, పవర్‌గ్రిడ్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. M&M, మారుతీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టైటాన్ లాభపడ్డాయి. అటూ క్రూడ్ ఆయిల్ ధర కూడా తగ్గుతోన్నాయి. బ్రెంట్ బ్యారేల్ ధర 106 డాలర్లు ఉండగా.. డబ్యూటీఐ బ్యారేల్ ధర 103 డాలర్లుగా ఉంది.

Read Also..  Post Office Savings Plan: పోస్టాఫీస్‌ అందిస్తోన్న అదిరిపోయే పథకం.. చిన్న పెట్టుబడితో సురక్షిత రాబడి.. వివరాలివే..