Business Idea: ఇంట్లో ఉండే రూ. వేలల్లో సంపాదించే ఛాన్స్‌.. బెస్ట్ బిజినెస్‌ ప్లాన్‌

అయితే తక్కువ పెట్టుబడితో ఇల్లు కూడా కదలకుండా చేసుకునే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్‌ ఐడియా. దూప్ స్టిక్స్‌ తయారీ. ప్రస్తుతం ఈ బిజినెస్‌కు మంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఇంట్లో అగరుబత్తులతో పాటు దూప్‌ స్టిక్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది...

Business Idea: ఇంట్లో ఉండే రూ. వేలల్లో సంపాదించే ఛాన్స్‌.. బెస్ట్ బిజినెస్‌ ప్లాన్‌
Business Idea
Follow us

|

Updated on: May 07, 2024 | 4:37 PM

ప్రస్తుతం చాలా మందికి వ్యాపారం చేయాలనే ఆశ పెరుగుతోంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేస్తూ రెండు చేతులా సంపాదించాలని భావిస్తున్నారు. అలాంటి వారి కోసం మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే చాలా మంది లాభాలు రావని, పెట్టుబడి భారాన్ని భరించలేకో వ్యాపారం చేయాలనే ఆలోచనను విరమించుకుంటారు.

అయితే తక్కువ పెట్టుబడితో ఇల్లు కూడా కదలకుండా చేసుకునే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్‌ ఐడియా. దూప్ స్టిక్స్‌ తయారీ. ప్రస్తుతం ఈ బిజినెస్‌కు మంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఇంట్లో అగరుబత్తులతో పాటు దూప్‌ స్టిక్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ డిమాండ్‌ను మన వ్యాపారానికి అస్త్రంగా మార్చుకుంటే భారీగా లాభాలు పొందొచ్చు. ఇంతకీ దూప్‌ స్టిక్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దూప్‌ స్టిక్స్‌ను తయారు చేయడానికి దూప్‌ స్టిక్‌ మేకింగ్ మిషన్‌ కావాల్సి ఉంటుంది. ఇలాంటి మిషన్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్‌తో పాటు వీటి తయారీకి అవసరమైన ముడి సరుకును కూడా కంపెనీలు అందిస్తుంటాయి. ముడిసరకుగా వచ్చే పొడిలో వాటర్‌ను కలుపుకొని మిషన్‌లో వేసి ఆపరేట్‌ చేస్తే దూప్‌ స్టిక్స్‌ తయారు అవుతాయి. ఒక్కసారి 25 దూప్‌స్టిక్స్‌ రడీ అవుతాయి. వీటిని ఒక రోజు ఎండలో ఉంచిన తర్వాత కవర్స్‌లో ప్యాక్‌ చేసుకొని మీకు దగ్గర్లో ఉన్న దుకాణాలు విక్రయించుకోవచ్చు.

ఇక పెట్టుబడి విషయానికొస్తే దూప్ స్టిక్స్‌ మిషన్‌ మార్కెట్‌లో సుమారు రూ. 10 వేలకిపైగా ఉంది. అలాగే ముడి సరకు రూ. 250 నుంచి మొదలవుతాయి. ఇక నిమిసానికి సుమారు 60 వరకు దూప్‌ స్టిక్స్‌ను తయారు చేసుకోవచ్చు. ప్యాకింగ్ కొంత ఖర్చవుతుంది. ఈ బిజినెస్‌తో ఎంత తక్కువ కాదన్నా మంచి మార్కెట్ ఉంటే నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..