Business Loan: వ్యాపారానికి రుణం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. ఇక్కడ తెలుసుకోండి..

Business Loan: ప్రస్తుతం ఉన్న పోటీ వ్యాపార వాతావరణంలో.. విజయవంతమైన సంస్థకు వృద్ధి కీలకంగా మారింది. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం వనరుల అవసరం ఉంటుంది. ఆర్థికమే వ్యాపారాన్ని నడిపించే ఇంధనం. లోన్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..

Business Loan: వ్యాపారానికి రుణం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. ఇక్కడ తెలుసుకోండి..
Business Loan
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 14, 2022 | 8:35 AM

Business Loan: ప్రస్తుతం ఉన్న పోటీ వ్యాపార వాతావరణంలో.. విజయవంతమైన సంస్థకు వృద్ధి కీలకంగా మారింది. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం వనరుల అవసరం ఉంటుంది. ఆర్థికమే వ్యాపారాన్ని నడిపించే ఇంధనం. వ్యాపారాన్ని కొత్త ప్రదేశాలకు విస్తరించాలనుకున్నా, అధిక ఉత్పత్తి కోసం సాంకేతికంగా నూతన యంత్రాలను కొనుగోలు చేయాలన్నా.. కొత్త యూనిట్‌ను ప్రారంభించడానికి ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాలనుకున్నా డబ్బు చాలా అవసరం. కొన్నిసార్లు అలాంటి ఫైనాన్స్ కోసం వ్యక్తిగత వనరులు ఉండవచ్చు. ఇందుకోసం సదరు వ్యాపారికి వ్యాపార రుణం ఎంతగానో అవసరం అవుతుంది. ఇందుకోసం అవసరమైన రుణాలను సరసమైన వడ్డీ రెట్లకు మార్కెట్లో అనేక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్నాయి. అర్హత కలిగిన రుణగ్రహీతలకు తక్కువ డాక్యుమెంటేషన్ తో అవి వ్యాపార రుణాలను అందిస్తున్నాయి.

వ్యాపార రుణాలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..

  • రుణం తీసుకోవడం వల్ల వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు సమకూరుతాయి. ఈ నిధులతో కొత్త మార్కెట్లలో ఉత్పత్తులను అమ్ముకునేందుకు సంస్థలకు అవకాశం లభిస్తుంది. రోజువారీ వ్యాపార నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరుతాయి.
  • బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం వల్ల సంస్థపై పూర్తి నిర్ణయాత్మక హక్కు వ్యవస్థాపకులకే ఉంటుంది. అదే లిస్టెడ్ కంపెనీలా మార్కెట్ నుంచి డబ్బు సమీకరిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యాలు ఉంటాయి. అందువల్ల రుణం తీసుకోవడం ఒక మంచి నిర్ణయం.
  • రుణ గ్రహీత బ్యాంకు సూచించిన షరతులకు అనుగుణంగా చెల్లింపులు సమయానికి చేస్తే అతని క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ వల్ల రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు పొందవచ్చు. ఇది రుణ గ్రహీతకు మంచి సౌలభ్యంగా నిలుస్తుంది.
  • ఎటువంటి తాకట్టులేకుండా వ్యాపార రుణాన్ని తక్కువ గడువులో పొందవచ్చు. చాలా రుణ సంస్థలు ప్రీ పేమెంట్, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా వ్యాపారులకు రుణాలు అందిస్తుంటాయి.
  • చాలా రుణ సంస్థలు బిజినెస్ లోన్, టర్మ్ లోన్, మర్చంట్ లోన్ అంటూ వివిధ రకాల రుణాలను అందిస్తుంటాయి. వీటిలో రుణ గ్రహీత అవసరాలకు అనుగుణంగా వివిధ పేమెంట్ స్కీములను అందుబాటులో ఉంచుతున్నాయి.
  • తీసుకున్న వ్యాపార రుణంపై చెల్లించే వడ్డీని ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా పొందవచ్చు. అవి ట్యాక్స్ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి.

ఇవీ చదవండి..

5G in India: త్వరలోనే భారత్ లో 5జీ సేవలు.. స్పెక్ట్రమ్ వేలం ఎప్పటినుంచంటే..

Market News: ఒడిదొడుకుల్లో ఆసియా మార్కెట్లు.. ఆ కారణంగా పెరగనున్న బంగారం ధర..