Petrol Diesel Price: స్థిరంగా కొనసాగుతోత‌న్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరోలా..

పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు 103 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. 103 రోజులుగా భారత్‌లో పెట్రోలు-డీజిల్ ధరలు మారలేదు. దేశవ్యాప్తంగా నవంబర్ 4, 2021న..

Petrol Diesel Price: స్థిరంగా కొనసాగుతోత‌న్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరోలా..
Follow us

|

Updated on: Feb 14, 2022 | 8:36 AM

Petrol-Diesel Rates Today: పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు 103 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. 103 రోజులుగా భారత్‌లో పెట్రోలు-డీజిల్ ధరలు మారలేదు. దేశవ్యాప్తంగా నవంబర్ 4, 2021న పెట్రోల్ , డీజిల్ ధరలలో చివరి మార్పు జరిగిందని పేర్కొనవచ్చు. అప్పటి నుంచి దేశంలోని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.  చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యత్యాసాలున్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను సోమవారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి

సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ కాకుండా వందలాది వస్తువుల ధరలు పెరుగుతాయి, అయితే ప్రస్తుతం భారతదేశంలో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అందుకే దేశంలోని అన్ని నగరాలు, గ్రామాలు, జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ పాత ధరలకే విక్రయిస్తున్నారు. ముడి చమురు సుమారు రెండు వేల వస్తువులలో ముడి పదార్థంగా ఉపయోగించబడుతుంది. అందువల్ల, ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, పెట్రోల్-డీజిల్ మాత్రమే కాకుండా అనేక ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.55గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.94గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.09గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.84గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.22గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.29కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.36లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.57 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.66గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.23గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.33గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.23లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.36లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..