Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాదారులకు కేంద్రం తీపి కబురు.. ఆ చార్జీల మినహాయింపునకు నిర్ణయం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం తాగా పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. బ్యాటరీ ఆధారితంగా నడిచే వాహనాలకు..

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాదారులకు కేంద్రం తీపి కబురు.. ఆ చార్జీల మినహాయింపునకు నిర్ణయం
Car
Follow us
Javeed Basha Tappal

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2021 | 12:12 PM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం తాగా పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. బ్యాటరీ ఆధారితంగా నడిచే వాహనాలకు రిజిస్ట్రేన్ సర్టిఫికెట్ జారీ, రెవన్యువల్ చార్జీల నుంచి మినహాయింపును కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించనట్టు అవుతుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ భావిస్తొంది. బ్యాటరీ ఆధారితంగా నడిచే వాహనాలకు రిజిస్ట్రేన్ సర్టిఫికెట్ జారీ, రెన్యూవల్ చార్జీల నుంచి మినహాయింపునకు సంబంధించి గత మే 27న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం ప్రభుత్వం 30 రోజుల్లోపు అభ్యంతరాలు, సలహాలు ఏమైనా ఉంటే తెలపాలని పౌరులకు సూచించింది. దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు సవరణలు చేస్తూ బ్యాటరీ ఆధారిత వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ, రెన్యూవల్ చార్జీపై కేంద్రం మినహాయింపు ఇచ్చింది.

Read this also: మొబైల్ యూజర్లు కేంద్రం అలర్ట్.. ఇలా చెయ్యకపోతే ఇబ్బందులు తప్పవు.. జర భద్రం..!:Moboile Users Video.

MG ZS EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చు..ఎంజీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు ఇవే!