AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MG ZS EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చు..ఎంజీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు ఇవే!

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కునేలా చేస్తోంది. సంప్రదాయ ఇంధనం అంటే పెట్రోల్-డీజిల్ తో పోలిస్తే ప్రజలు ఇప్పుడు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

MG ZS EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చు..ఎంజీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు ఇవే!
Mg Electric Car
KVD Varma
|

Updated on: Aug 03, 2021 | 10:05 PM

Share

MG ZS EV: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కునేలా చేస్తోంది. సంప్రదాయ ఇంధనం అంటే పెట్రోల్-డీజిల్ తో పోలిస్తే ప్రజలు ఇప్పుడు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే చాలా కంపనీలు తమ ఈ వాహనాలను విడుదల చేశాయి. తాజాగా ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు ZSEV ని మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈకారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 419 కిలోమీటర్లు దూసుకుపోతుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ వెళ్లిపోవచ్చు.

కంపెనీ ఈ కారును రెండు వేరియంట్లలో విడుదల చేసింది. కంపెనీ కారులో 7.4 కిలోవాట్ల ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్ ఇచ్చింది. దీని కారణంగా ఈ కారు బ్యాటరీ 6 నుంచి 8 గంటలోపు నూరు శాతం ఛార్జింగ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ కారుకు 50 కిలోవాట్ల డీసీ ఛార్జర్ మద్దతు కూడా ఉంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే కనుక ఈ కారు కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జ్ చేయవచ్చు. దీంతోపాటు పోరాటబుల్ ఛార్జర్ ను కూడా అందిస్తోంది కంపెనీ. దీని సాధారణ 15 ఏఎంపీ సాకెట్ ద్వారా దీని బ్యాటరీ ఛార్జింగ్ చేయొచ్చు. అంటే.. ఇంటిలో సాధారణ ఏసీ ప్లగ్ సహాయంతో కారును రీఛార్జ్ చేసుకోవచ్చు.

కారు ఫీచర్ల గురించి చూస్తే.. ఇదిపూర్తి ప్రీమియం మోడల్. దీనిలో 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్ మెంట్ సిస్టం..ఏపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెట్ తో అందించింది. ఇది కాకుండా కారులో సం రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, అంతర్న్ర్మిత ఎయిర్ ప్యూరిఫ్యర్, ప్రొజెక్టర్ హెడ్ ల్యంప్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇచ్చారు. ఆరు ఎయిర్ బ్యాంకులు, ఏబీఎస్, ఈబీడీ, బ్రేక్ ఆసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఇచ్చారు.

అలాగే, దీనిలో ఇంస్టాల్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్ 44.5 kwh బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ మోటార్ 143 PS శక్తిని, 353 Nm తారక్ ను ఉత్పత్తి చేస్తుంది. కారు పరిధికి సంబంధించి, ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేసిన తరువాత 419 కిలోమీటరల్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఎంజీ మోటార్స్ ఈ కారును కేవలం ఒక నెలలో 600 మంది బుక్ చేశారు. ఇది కంపెనీ విజయవంతమైన ఎలక్ట్రిక్ కారుగా చెప్పొచ్చు. ఈకారు హ్యుందాయ్ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కోనతో నేరుగా పోటీ పడుతోంది.

Also Read: Tesla Car: తాగి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా ఆటోపైలట్ ఫీచర్.. వీడియో వైరల్

Jio – MG Motor: మరో రంగంలోకి అడుగు పెట్టిన జియో.. ఎస్‌యూవీ కార్లలో అత్యాధునిక ఫీచర్స్‌