Jio – MG Motor: ఎంజీ మోటార్స్‌తో జియో కీలక ఒప్పందం… నెట్‌ కనెక్టివిటీలో కొత్త శకం

Reliance Jio - MG Motor: ఎంజీ మోటార్స్‌ ఇండియా (MG Motors) తన రాబోయే మిడ్‌ సైజ్ ఎస్‌యూవీలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IOT) ఫీచర్ల కోసం డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ జియో..

Jio - MG Motor: ఎంజీ మోటార్స్‌తో జియో కీలక ఒప్పందం... నెట్‌ కనెక్టివిటీలో కొత్త శకం
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2021 | 12:17 PM

Reliance Jio – MG Motor: ఎంజీ మోటార్స్‌ ఇండియా (MG Motors) తన రాబోయే మిడ్‌ సైజ్ ఎస్‌యూవీలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IOT) ఫీచర్ల కోసం డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ జియో ఇండియాతో ఒప్పందం జరిగినట్లు మంగళవారం వెల్లడించింది. ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్‌ కనెక్టివిటీ. ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఎంజీ మోటార్స్‌ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు జతకట్టింది. అంతరాయం లేని ఇంటర్నెట్‌ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి. ఈ మేరకు ఎంజీ మోటార్స్‌ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. అయితే త్వరలోనే మిడ్‌ రేంజ్‌ ఎస్‌యూవీని లాంఛ్‌ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్‌ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్‌ ఛేంజర్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో చేతులు కలిపినట్లు ఎంజీ మోటార్స్‌ ప్రసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా తెలిపారు

త్వరలో రిలీజ్‌ చేయబోతున్న మిడ్‌ రేంజ్‌ ఎస్‌యూవీలో నిరంతం నెట్‌ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్‌ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్‌వర్క్‌ అందించనుంది. సాంకేతిక పరంగా నెట్‌వర్క్‌ను అందించేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎంజీ మోటార్స్‌ ఇండియా వెల్లడించింది. కారులో నిరంతరం నెట్‌ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్‌నెట్‌ను పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి

Home Loan: మీరు హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు ఇవే..!

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 15న విడుదల.. మరిన్ని వివరాలు