AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : విద్యుత్‌ని లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకున్న తల్లి కోతి..!

Viral Video : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు మరెవరు లేరు అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం. డబ్బుంటే ప్రపంచంలో

Viral Video : విద్యుత్‌ని లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకున్న తల్లి కోతి..!
Viral
uppula Raju
|

Updated on: Aug 03, 2021 | 9:39 PM

Share

Viral Video : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు మరెవరు లేరు అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం. డబ్బుంటే ప్రపంచంలో అన్ని దొరుకుతాయి కానీ వెల కట్టలేనిది తల్లిప్రేమ. అది మనిషి అయినా జంతువైనా. తన పిల్లలు ఆపదలో ఉంటే ఏ తల్లి బరించలేదు. కచ్చితంగా కాపాడటానికి ప్రయత్నిస్తుంది. అలాంటి తల్లి మనసు గల కోతి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఆపదలో ఉన్న తన బిడ్డను ఎలా కాపాడిందో చూస్తే మీరు కూడా హ్యాట్సాప్ చెబుతారు.

ఈ వీడియోలో ఒక తల్లి కోతి ప్రేమకు మాత్రమే కాదు ధైర్యానికి కూడా మారుపేరుగా నిలిచింది. వీడియో చూసిన తర్వాత తల్లి ధైర్యాన్ని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోలో ఒక కోతి పిల్ల విద్యుత్ వైర్‌పై వేలాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దూకడానికి ప్రయత్నిస్తుంది కానీ తనవల్ల కావడం లేదు. విద్యుత్ వైర్లు భవనానికి చాలా దూరం ఉండటంతో తల్లిని చేరుకోలేకపోతుంది. అయితే బరువు ఎక్కువగా ఉంటే విద్యుత్ ప్రసరణ జరిగి షాక్ గురయ్యే ప్రమాదం ఉంటుంది.

దీంతో బిడ్డ కష్టాన్ని గమనించిన తల్లి కోతి తన తన ప్రాణాలను పట్టించుకోకుండా భవనం పై నుంచి విద్యుత్ తీగలపైకి దూకి తన బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తిరిగి భవనం పైకప్పుపైకి చేరుతుంది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు బాగా ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ఇలా వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో తల్లి కంటే పెద్దవారు ఎవరూ లేరని అన్నాడు. మరొక యూజర్ ఈ ప్రపంచంలో తల్లి దేవుడి మరొక రూపం అన్నారు. ఈ వీడియోను ఇండియన్ సర్వీస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ఖాతా నుంచి సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Hyderabad Water Supply: మరమ్మత్తు పనులు వాయిదా… మంచినీటి సరఫరా యథాతథం

Health Tips: బరువు తగ్గడానికి ఈ 5 ఆహారాలు బెస్ట్..! వ్యాధులు కూడా దూరం.. తెలుసుకోండి

Health Tips : డయాబెటీస్‌ రోగులకు బెండకాయ దివ్యఔషధం..! ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి..