Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి?
Bank Holiday: బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపేందుకు..

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మార్చి 24-25 తేదీలలో జరగాల్సిన బ్యాంక్ సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించింది. 5 రోజుల పనిదినంతో సహా అనేక కీలక అంశాలపై చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), ఆర్థిక సేవల విభాగం (DFS), కేంద్ర కార్మిక కమిషనర్ (CLC) ప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రత్యేకంగా యూనియన్ల డిమాండ్లను పరిష్కరించడానికి నిర్వహించబడిందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది.
మార్చి 24న బ్యాంకులు మూసివేయబడతాయా లేదా తెరిచి ఉంటాయా?
సమ్మె వాయిదా కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ రోజు అంటే మార్చి 24, రేపు మార్చి 25 న యథావిధిగా పనిచేస్తాయి. సమ్మె కారణంగా ఈ రెండు రోజులు మూసి ఉంటాయని ముందుగా నివేదికలు తెలిపినా.. సమ్మె వాయిదా పడటంతో బ్యాంకులు తెరిచే ఉంటాయి.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఎందుకు?
బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపేందుకు ప్రకటించారు. దీనితో పాటు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగులు పనిచేయరు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించగా, ప్రస్తుతం వాయిదా పడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి