Home Loan EMI: హోం లోన్ వినియోగదారులకు ఆ రెండు బ్యాంకులు షాక్.. వడ్డీ రేట్లు పెంపు..
అయితే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు బ్యాంకుల్లో వివిధ అవసరాల నిమిత్తం రుణం తీసుకున్న వారిపై వడ్డీ భారాన్ని మోపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ కలలా ఉంటుంది. ఎందుకంటే ఎంత కష్టపడినా సొంతింట్లో ఉన్నామనే సంతోషం అందరికీ దక్కదని అనుకుంటూ ఉంటారు. కొంతమంది హౌస్ లోన్ తీసుకుని మరీ సొంతింటి కలను నిజం చేసుకుంటూ ఉంటారు. బ్యాంకులు కూడా ఇలాంటి వారిని ఆకట్టుకోవడానికి తక్కువ వడ్డీ రేట్లో గృహ రుణాలను అందిస్తూ ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు బ్యాంకుల్లో వివిధ అవసరాల నిమిత్తం రుణం తీసుకున్న వారిపై వడ్డీ భారాన్ని మోపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఓ రెండు బ్యాంకులు హోంలోన్‌పై బేస్ పాయింట్లను పెంచాయి. దీంతో ప్రత్యక్షంగా గృహ రుణాలు, కారు, విద్యా రుణగ్రహీతలపై భారం పడనుంది. బేస్ పాయింట్లు పెంచిన ఆ బ్యాంకుల వివరాలేంటో ఓ సారి తెలుసుకుందాం.
హోం లోన్ ఈఎంఐపై పెంపు ఇలా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ రేట్లు ఏప్రిల్ 15, 2023 నుంచి అమల్లోకి వస్తాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఇది నేరుగా ఒక సంవత్సర కాలానికి గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు పొందిన కస్టమర్ల ఈఎంఐలను ప్రభావితం చేస్తుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.40 శాతానికి, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.90 శాతానికి, అలాగే ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.10 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం, డిపాజిట్ రేట్ల పెరుగుదలకు ప్రతిస్పందనగా వడ్డీరేట్లను పెంచారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కెనరా బ్యాంక్ కూడా తన రుణ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఎంసీఎల్ఆర్ రేటు ఆరు నెలలు, ఒక సంవత్సరం కాలవ్యవధికి ఇప్పుడు వరుసగా 8.45 శాతం, 8.65 శాతంగా ఉంది. అయితే, మిగిలిన కాలపరిమితి ఉన్న రుణాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంపు ఇలా
అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూ. 2 కోట్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. ఏడు రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై 2.75 శాతం నుంచి 5.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 200 రోజుల ఎఫ్‌డీలపై బ్యాంక్ గరిష్టంగా 7 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి