RBI Repo Rate: ఆర్‌బీఐ పెంచిన వడ్డీరేట్లతో మీరు తీసుకున్న హోమ్, కారు లోన్ ఈఎమ్‌ఐ ఎంత పెరగనుందో తెలుసా.?
RBI Repo Rate: రెటో రేటుతో పాటు, కీలక వడ్డీరేట్లను పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత పెరగనున్న వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి ఒక్కసారిగా భారం కానుంది. హౌసింగ్, కారు లోన్‌లు తీసుకున్న...
RBI Repo Rate: రెటో రేటుతో పాటు, కీలక వడ్డీరేట్లను పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత పెరగనున్న వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి ఒక్కసారిగా భారం కానుంది. హౌసింగ్, కారు లోన్‌లు తీసుకున్న వారికి నెలవారీగా చెల్లించే ఈఎమ్‌ఐ మొత్తం పెరగనుంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న కారణంతో ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వినియోగ దారులకు భారంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేపో రేటును 40 బేసిస్ పాయింట్లకు పెంచడంతో 4.40 శాతానికి చేరింది. మరి ఆర్‌బీఐ పెంచిన వడ్డీ రేట్ల కారణంగా కారు, హోం లోన్ తీసుకున్న ఓ వ్యక్తికి ఎంత ఈఎమ్‌ఐ పెరగనుందో ఓసారి చూద్దాం..
హౌజ్‌లోన్ తీసుకున్న వారు..
* ఉదాహరణకు ఓ వ్యక్తి 6.75 శాతం వడ్డీకి 20 ఏళ్ల కాలపరిమితితో రూ. 30 లక్షల హౌజ్‌లోన్ తీసుకుంటే ప్రస్తుతం అతను ప్రస్తుతం చెల్లిస్తోన్న ఈఎమ్‌ఐ రూ. 22,811గా ఉంది. అయితే తాజాగా ఆర్‌బీఐ సవరించిన వడ్డీ రేట్లతో (7.15) ఈ ఈఎమ్‌ఐ కాస్త రూ. 23,530కి చేరుతుంది.
* అదే రూ. 50 లక్షలు తీసుకుంటే సదరు వ్యక్తి ప్రస్తుతం చెల్లించే ఈఎమ్‌ఐ రూ. 38,018గా ఉంది. కానీ పెరిగిన వడ్డీ రేట్లతో రూ. 39,216కి చేరుతుంది.
* ఒకవేళ రూ. 1 కోటి హౌజ్ లోన్ తీసుకుంటే ప్రస్తుతం రూ. 76,036 చెల్లిస్తుంటారు. పెరిగిన వడ్డీరేట్లతో ఈ ఈఎమ్‌ఐ కాస్త రూ. 78,433కి చేరుతుంది.
కారు లోన్‌కు పెరిగే ఈఎమ్‌ఐ మొత్తం..
* ఒక వ్యక్తి 7 శాతం వడ్డీకి 7 ఏళ్ల కాల పరిమితితో రూ. 10 లక్షల లోన్ తీసుకుంటే ప్రస్తుతం అతను చెల్లించే ఈఎమ్‌ఐ రూ. 15,093గా ఉంది. అయితే పెరిగిన వడ్డీ రేట్ల (7.4) ద్వారా ఈ మొత్తం కాస్త రూ. 15,289కి చేరుతుంది.
* ఒక వేళ రూ. 20 లక్షల లోన్ తీసుకుంటే ప్రస్తుతం చెల్లించే ఈఎమ్‌ఐ రూ. 30,185గా ఉంటే, తాజాగా పెరిగిన వడ్డీ రేట్లతో రూ. 30, 578కి చేరుతుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు ప్రామాణిక వడ్డీరేట్లు, కాలపరిమితిని పరిగణలోకి తీసుకొని తెలిపనవి. కానీ వడ్డలీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. కాబట్టి పూర్తి వివరాల కోసం మీరు లోన్ తీసుకున్న బ్యాంక్‌ను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తలకు క్లిక్ చేయండి..
LPG price: సామాన్యుడికి చమురు కంపెనీలు షాక్.. గ్యాస్ వినియోగదారునిపై మరో బండ
White Peacock: ఆకాశంలో విహరించిన తెల్లటి నెమలి.. వీడియో వైరల్