Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డు.. దేశంలోనే తొలి సంస్థ

Reliance Industries: దేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డు సాధించింది. ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani)కి చెందిన ఈ సంస్థ 100 బిలియన్‌ డాలర్ల..

Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డు.. దేశంలోనే తొలి సంస్థ
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2022 | 12:33 PM

Reliance Industries: దేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డు సాధించింది. ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani)కి చెందిన ఈ సంస్థ 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7.7 లోల కోట్లు) వార్షిక ఆదాయాన్ని అధిగమించిన ఏకైక దేశీయ కంపెనీగా పేరొందింది. నివేదికల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.16,203 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసికం లాభం రూ.13.227 కోట్ల కంటే ఇది 22.5 శాతం ఎక్కువ. సంస్థ ఇన్‌కమ్‌ 35 శాతం పెరిగి 2.32 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

2021-22 అక్టోబర్‌-డిసెంబర్‌ లాభంతో పోల్చినట్లయితే 12.6 శాతం మేర తగ్గింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం రూ.60,705 కోట్లు. ఆదాయం రూ.7.92 లక్షల కోట్లు (102 బిలియన్‌ డాలర్ల)కు చేరుకుంది. ఇక అన్ని కేటగిరిల్లో కలుపుకొని ఏడాదిలో 2.1 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇక వడ్డీ పన్నులు, తరుదుల, తనఖా ముందు ఆదాయాలు మార్చి త్రైమాసికంలో రూ.33.968 కోట్లకు చేరుకున్నాయి. 2020-21 మార్చి త్రైమాసికంతో పోల్చుకున్నట్లయితే ఇది 28 శాతం అధికమనే చెప్పాలి.

వ్యాపారాల స్థూల ఆదాయాలు:

2021-22 వినియోగ వ్యాపారాల స్థూల ఆదాయాలు రూ.3 లక్షల కోట్లకు చేరుకోవడంతో ఈ వ్యాపార ఎబిటా రూ.50,000 కోట్లను అధిగమించింది. రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయమున్న రిటైల్‌ వ్యాపార ఎబిటా రూ.12,000 కోట్లను అధిగమించింది. డిజిటల్‌ సేవలు సైతం రూ.1 లక్ష కోట్ల ఆదాయంపై రూ.40,000 కోట్ల ఎబిటా నమోదు చేశాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

India Post Payments Bank: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డోర్‌స్టెప్‌ సేవలు.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండిలా..!

Pawan Hans: తీవ్ర నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ సంస్థ ప్రైవేటు చేతుల్లోకి.. అమ్మకానికి కేంద్ర సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే