Pawan Hans: తీవ్ర నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ సంస్థ ప్రైవేటు చేతుల్లోకి.. అమ్మకానికి కేంద్ర సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Pawan Hans: నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ సంస్థ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లింది. హెలికాప్టర్‌ సర్వీస్‌ కంపెనీ పవన్‌ హన్స్‌ను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. జూన్‌లోగా..

Pawan Hans: తీవ్ర నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ సంస్థ ప్రైవేటు చేతుల్లోకి.. అమ్మకానికి కేంద్ర సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2022 | 10:55 AM

Pawan Hans: నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ సంస్థ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లింది. హెలికాప్టర్‌ సర్వీస్‌ కంపెనీ పవన్‌ హన్స్‌ను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. జూన్‌లోగా పవన్‌ హన్స్‌కు అప్పగించే ప్రక్రియ పూర్తవుతుందని ఓ అధికారి తెలిపారు. పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌లో తన 51 శాతం వాటాను విక్రయించడానికి స్టార్‌9 మొబిలిటీకి రూ.211.14 కోట్లను బదిలీ చేయడానికి ప్రభుత్వం గత నెలలో ఆమోదించింది. ఇక ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌కు 49 శాతం వాటా ఉంది. అయితే వరుస నష్టాలతో కేంద్రం పవన్‌ హన్స్‌లో వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే ఓఎన్జీసీ సైతం తన వాటాను కేంద్రం నిర్ణయించిన వాటాకే అమ్మేందుకు సిద్ధమైంది. కేటాయింపులు వచ్చేవారం జారీ చేయనున్నారు. ఆ తర్వాత కొనుగోలుదారులు కంపెనీ అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. ఒకటిన్నర నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

ఈ అమ్మకానికి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, నిర్మలాసీతారామణ్‌, జ్యోతిరాధిత్యలు అమోదం తెలిపారు. కాగా, 2019-20లో పవన్‌ హన్స్‌ రూ.28.08 కోట్లు, 2018-19లో రూ.69.2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2020-21లో రూ.100 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. అందుకే కేంద్రం పవన్‌ హన్స్‌ను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం.. స్టార్‌ మొబిలిటీకి ప్రభుత్వం కేటాయింపు లేఖను జారీ చేసిన తర్వాత ఓఎన్‌జీసీ తన వాటాలను అందించడానికి ఏడు రోజులు పడుతుంది. అదే విధంగా స్టార్‌ 9 మొబిలిటీకి కూడా ఓన్‌జీసీ ఆఫర్‌ను అంగీకరించాలా..? వద్దా అని నిర్ణయించుకోవడానికి అదే రోజుల సమయం ఇవ్వబడుతుంది. పవన్‌ హన్స్‌ 1985లో స్థాపించబడింది. ప్రస్తుతం కంపెనీకి 42 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్ల సగటు జీవిత కాలం 20 సంవత్సరాలకుపైగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bank Branches: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. 600 బ్రాంచ్‌ల మూసివేతకు రంగం సిద్ధం..? ఎందుకంటే..!

Post Office: పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతాను ఎవరెవరు తెరవవచ్చు.. వడ్డీ రేటు ఎంత..? పూర్తి వివరాలు

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం