AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: దసరా నుంచి దీపావళి వరకు బ్యాంకులకు భారీగా సెలవులు

సెప్టెంబర్‌ నెల ముగియనుంది. ఇక అక్టోబర్‌ నెల రాబోతోంది. ప్రతి నెల రాగానే బ్యాంకు కస్టమర్లకు గుర్తుకు వచ్చేది బ్యాంకు సెలవుల గురించి. నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్‌లో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. అయితే..

Bank Holidays: దసరా నుంచి దీపావళి వరకు బ్యాంకులకు భారీగా సెలవులు
Bank Holidays
Subhash Goud
|

Updated on: Sep 29, 2024 | 4:05 PM

Share

సెప్టెంబర్‌ నెల ముగియనుంది. ఇక అక్టోబర్‌ నెల రాబోతోంది. ప్రతి నెల రాగానే బ్యాంకు కస్టమర్లకు గుర్తుకు వచ్చేది బ్యాంకు సెలవుల గురించి. నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్‌లో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.

కీలకమైన పండుగల కారణంగా అక్టోబర్‌లో బ్యాంక్‌లకు చాలా రోజులు సెలవులు వస్తున్నాయి. శారదీయ నవరాత్రి నుంచి దసరా, దీపావళి వరకు హాలిడేస్‌ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. వచ్చే నెలలో మీరు ఏదైనా బ్యాంక్‌ లావాదేవీ చేయాలనుకుంటే, ముందుగా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవడం ముఖ్యం. ఈ లిస్ట్‌ చూసిన తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయలుదేరండి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రతినెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.

ఇది కూడా చదవండి: PM Kisan: గుడ్‌న్యూస్‌.. ఆ రైతులకు పీఎం కిసాన్‌ స్కీమ్‌లో 4 వేలు పెంపు

అక్టోబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు:

అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ సెలవుల్లో ఆదివారం, శనివారం సెలవులు సహా వివిధ పండుగల సెలవులు కూడా ఇందులో కలిసి ఉన్నాయి.

➦ 01 అక్టోబర్ – అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్ములో బ్యాంకులు పని చేయవు

➦ 02 అక్టోబర్ – గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది

➦ 03 అక్టోబర్ – నవరాత్రుల ప్రారంభం సందర్భంగా జైపుర్‌లోని బ్యాంకులకు సెలవు

➦ 06 అక్టోబర్ – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌

➦ 10 అక్టోబర్ – దుర్గాపూజ, దసరా, మహా సప్తమి కారణంగా అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలో బ్యాంకులు బంద్‌

➦ 11 అక్టోబర్ – దసరా, మహా అష్టమి, మహా నవమి, ఆయుధ పూజ, దుర్గాపూజ, దుర్గాష్టమి కారణంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు సెలవు

➦ 12 అక్టోబర్ – రెండో శనివారం దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

➦ 13 అక్టోబర్ – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌

➦ 14 అక్టోబర్ – దుర్గాపూజ లేదా దాసేన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు

➦ 16 అక్టోబర్ – లక్ష్మీ పూజ కారణంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకులు బంద్‌

➦ 17 అక్టోబర్ – మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలోని బ్యాంకులకు సెలవు

➦ 20 అక్టోబర్ – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

➦ 26 అక్టోబర్ – నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు

➦ 27 అక్టోబర్ – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది

➦ 31 అక్టోబర్ – దీపావళి కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు

అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా మీ బ్యాంకు పనులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చేసుకునే లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. లావాదేవీలతో పాటు ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోనే ఉంటాయి.

ఇది కూడా చదవండి: BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను ఉచితం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..