Bank Holidays May 2023: అలర్ట్.. మేలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినెల విడుదల చేస్తుంటుంది. అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండుగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మారుతుంటాయి. ఇక ఏప్రిల్ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. మే నెల రాబోతోంది. అయితే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి.
2023 May Month Holiday List: ప్రతిరోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లే వారు చాలా మందే ఉంటారు. ఏదో ఒక అవసరం కోసం వారంలో ఒక్క రోజైనా బ్యాంక్‌కు వెళ్లాల్సి రావొచ్చు. అయితే బ్యాంకులకు నెలలో ఏయే రోజుల్లో పని చేస్తాయి లేదా మూసి ఉంటాయన్న విషయం ముందస్తుగా తెలుసుకోవడం చాలా కీలకం. ఇవి తెలుసుకోకపోతే సమయం వృథా అవుతుంది. అందుకే బ్యాంకు వినియోగదారులు బ్యాంకుల సెలవుల గురించి ముందుస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి నెల, పండుగలు, వారాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేస్తారనే విషయం తెలిసిందే. బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినెల విడుదల చేస్తుంటుంది. అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండుగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మారుతుంటాయి. ఇక ఏప్రిల్ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. మే నెల రాబోతోంది. అయితే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. ఆ జాబితాను ఓసారి చూద్దాం..
మే 1 – మేడే
మే 5 – బుద్ద పూర్ణిమ
మే 7- ఆదివారం
మే 9- రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
మే 13 – రెండో శనివారం
మే 14- ఆదివారం
మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే)
మే 21- ఆదివారం
మే 22- మహారాణా ప్రతాప్ జయంతి
మే 24- కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (త్రిపురాలో)
మే 27- నాలుగో శనివారం
మే 28- ఆదివారం
నోట్: ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించపోవచ్చు. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయని గమనించండి.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి