Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు బంద్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలకు కూడా సెలవులు ప్రకటించింది. మరో మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ సెలవులతో సహా నెలలో 15 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంటుంది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ). బ్యాంకులకు సంబంధించిన వివిధ పనులను చేసుకునేందుకు సెలవులను గమనించి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించకుంటే సమయం వృధా కావడమే కాకుండా కొంత డబ్బు కూడా వృధా అవుతుంటుంది. ముందస్తుగానే బ్యాంకులకు సెలవులను గమనించి ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు జాతీయ సెలవు దినాలు. మరో ఆరు రోజులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. మొత్తం 15 రోజుల పాటు ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే మార్చి నెలకు కూడా సెలవులు ప్రకటించింది. మరో మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ సెలవులతో సహా నెలలో 15 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
వాస్తవానికి ప్రతి సంవత్సరం బ్యాంక్ ఉద్యోగుల కోసం ఆర్బీఐ ద్వారా నోటిఫైడ్ బ్యాంకుల ఖాతాలను వార్షికంగా క్లోజ్ చేయడమే దీనికి కారణం. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు మార్చి 31న ఆర్థిక పనిని పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉంటారు.
ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులు కూడా ఎక్కువ గంటలు పని చేస్తారు. దీని కారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1న బ్యాంక్ మూసివేస్తారు. యాన్యూవల్ క్లోజింగ్ రోజుగా దీనిని పరిగణిస్తూ.. బ్యాంకులు ఆ రోజున సెలవు ఇస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచిఉంటాయి.
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు:
- ఏప్రిల్ మొదటి తేదీన బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు తెరిచి ఉన్నప్పటికీ, వార్షిక ముగింపు కోసం డబ్బు చెల్లించలేరు.
- ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఏప్రిల్ 4న మహాబీర్ జయంతి.
- ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
- ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 8న రెండో శనివారం బ్యాంకులు మూతపడనున్నాయి.
- అదేవిధంగా ఏప్రిల్ 14న డా. అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 15న బెంగాలీ నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- మరోవైపు, ఏప్రిల్ 16 ఆదివారం
- 18న ఈద్-ఉల్-ఫితర్
- ఏప్రిల్ 22న రంజాన్
- ఏప్రిల్ 23, 30 తేదీల్లో ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఈ సెలవుల జాబితా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే. RBI మార్గదర్శకాల ప్రకారం, ప్రతి నెల రెండవ మరియు నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడినా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తప్పడం లేదు. 24 గంటల ఆన్‌లైన్ సేవ కొనసాగుతుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం