AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లాంచ్.. ధర రూ.164 కోట్లు..! కొనుగోలు చేసింది ఎవరో తెలుసా..?

సెలబ్రిటీల చేతికి ఖరీదైన వాచ్‌ చూసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తే.. రాజకీయ నాయకుల చేతికి ఉన్న వాచ్ పలువురిని ఇబ్బంది పెట్టింది. అయితే వీటన్నింటిని తలదన్నేలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌ను విడుదల చేశారు. ఈ వాచ్ ధర 164 కోట్ల రూపాయలు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లాంచ్.. ధర రూ.164 కోట్లు..! కొనుగోలు చేసింది ఎవరో తెలుసా..?
World Most Expensive Watch
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2023 | 9:05 PM

Share

ఖరీదైన గడియారం.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. సెలబ్రిటీల చేతిలో ఒకటి రెండు కోట్ల రూపాయల ధర కలిగిన వాచ్‌ ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తే.. రాజకీయ నాయకుల చేతిలో ఉన్న వాచ్ పలువురి ఇబ్బంది పెట్టింది. అయితే వీటన్నింటిని తలదన్నేలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌ను విడుదల చేశారు. ఈ వాచ్ ధర 164 కోట్ల రూపాయలు. ఈ గడియారాన్ని ప్రముఖ అమెరికన్ జ్యువెలరీ, వాచ్ కంపెనీ అయిన జాకబ్ & కంపెనీ విడుదల చేసింది.

జెనీవాలో జరిగిన వార్షిక వాచ్ అండ్ సర్ ప్రైజ్ ఎగ్జిబిషన్‌లో ఈ వాచ్‌ను విడుదల చేశారు. 20 మిలియన్ US డాలర్ల విలువైన ఈ వాచ్‌ని తయారు చేయడానికి జాకబ్ & కంపెనీకి సరిగ్గా మూడున్నరేళ్లు పట్టింది. గడియారం మొత్తం పసుపు వజ్రం, బంగారంతో తయారు చేశారు. 216.89 క్యారెట్ డైమండ్ ఉపయోగించారు. ఇది సంస్థ మాస్టర్ పీస్ అని గర్వంగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వజ్రం చాలా సున్నితంగా కత్తిరించారు. ఈ గడియారం విలాసవంతంగా మాత్రమే కాకుండా, చాలా ఆకర్షణీయంగా కూడా తయారు చేశారు. ఈ వాచ్ ఫస్ట్ లుక్ లోనే అందరినీ ఆకర్షిస్తుందని జాకబ్ అండ్ కంపెనీ చెబుతోంది. అవును, కంపెనీ చెప్పినట్లుగా ఈ వాచ్ చాలా ఆకర్షణీయమైన డిజైన్‌లో తయారు చేశారు.

జాకబ్ కంపెనీ ఈ గడియారాన్ని తయారు చేయడానికి సుమారు 3.5 సంవత్సరాలు పట్టింది. 25 మంది అత్యంత ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన నిపుణులు పనిచేశారు. ఇందులో ఉపయోగించే పసుపు వజ్రం చాలా ప్రత్యేకం. వజ్రాలు సాధారణంగా దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంటాయి. కానీ పసుపు వజ్రం చాలా అరుదైనది.

జాకబ్ కంపెనీ ఖరీదైన వాచ్‌ని విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఈ గడియారాన్ని 260 క్యారెట్ వైట్ డైమండ్‌తో తయారు చేసి విడుదల చేశారు. 2018లో, 127 క్యారెట్ పసుపు డైమండ్ వాచ్ విడుదలైంది. దీని ధర 6 మిలియన్ అమెరికన్ డాలర్లు.

జాకబ్ కంపెనీ 21 అత్యంత ఖరీదైన వాచీలను విడుదల చేసింది. 2018లో, బాక్సింగ్ లెజెండ్ ఫ్లాయిడ్ మేవెదర్ జాకబ్స్ కంపెనీ నుండి ఖరీదైన వాచ్‌ని కొనుగోలు చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో ఈ ఖరీదైన వాచ్‌ని కొనుగోలు చేశాడు. మేవెదర్, రొనాల్డో కొనుగోలు చేసిన ఖరీదైన వాచ్ దాదాపు 18 మిలియన్ US డాలర్లు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?