విమానంలో ఫోన్ ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టాలి..? లేదంటే ఏం జరుగుతుందో తెలుసా..?
విమాన ప్రయాణ సమయంలో మీ స్మార్ట్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం మంచిది అని మీకు విమాన సిబ్బంది సూచిస్తారు. అలా ఎందుకు అనౌన్స్ చేస్తారో ఎప్పుడైనా మీరు ఆలోచించారా. దీనికి కారణం ఏంటో తెలుసుకోండి..
Updated on: Mar 31, 2023 | 7:43 PM

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ లేదా ‘ఫ్లై మోడ్’ ఫీచర్ గురించి మీరు తప్పక విని ఉంటారు. చాలా మంది మొబైల్ యూజర్లు తమకు వచ్చే కాల్స్ కాల్ నుంచి తప్పించుకునేందుకు ఈ ఆప్షన్ ను ఉపయోగిస్తారు. కానీ నిజమైన అర్థంలో ఇది విమాన ప్రయాణంలో ఉపయోగించేందుకు రూపొందించబడింది.

విమాన ప్రయాణ సమయంలో మొబైల్‌ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం మంచిది. అలా ఎందుకు చెప్పారో ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి కారణం తెలుసుకోండి.

సాధారణంగా మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారం ఉంటుంది. విమాన ప్రయాణంలో కూడా ఈ రేడియో సిగ్నల్స్ కొనసాగుతాయి. అందువల్ల, ప్రయాణీకులు విమాన ప్రయాణానికి ముందు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది. ఇలా చేసిన తర్వాత సిగ్నల్ ప్రసారం ఆగిపోతుంది.

చాలా ఎయిర్‌లైన్స్ ఈ రేడియో సిగ్నల్‌ల ఉనికి విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్ , అనేక ఇతర ముఖ్యమైన సిస్టమ్‌లను ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నాయి, కాబట్టి ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది. ఇది ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Flight

మీరు ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచకుంటే కంట్రోల్ స్టేషన్‌కి పైలట్‌తో కమ్యూనికేట్ చేయడం కష్టమవుతుంది. ఇది విమానం దారితప్పిన లేదా క్రాష్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయమని సూచిస్తారు.
