Bank Holidays: కస్టమర్లకు బిగ్ అలెర్ట్.. జనవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. వివరాలివే..
మరికొద్ది రోజుల్లో డిసెంబర్ నెల ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2023 ప్రారంభం కానుంది. ఈ తరుణంలో..
మరికొద్ది రోజుల్లో డిసెంబర్ నెల ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2023 ప్రారంభం కానుంది. ఈ తరుణంలో మీరేమైనా ఆర్ధిక లావాదేవీలు చేయాలనుకుంటే.. ముందుగా జనవరిలో ఎప్పుడెప్పుడు బ్యాంక్ సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. తద్వారా మీరు మీ బ్యాంకు పనులను త్వరగా పూర్తి చేసుకోగలరు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం.. వచ్చే నెలలో బ్యాంకులకు 6 రోజుల సెలవులు, ఇక మిగతావన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించినవి. ఇవన్నీ కలిపి మొత్తంగా జనవరి నెలలో బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. మరి ఏయే రాష్ట్రాలకు ఏరోజు సెలవు వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి 2023 బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి..
జనవరి 1, 2023 – నూతన సంవత్సరం, ఆదివారం(దేశం మొత్తం)
జనవరి 2, 2023 – (మిజోరామ్)
జనవరి 3, 2023 – (ఇంఫాల్)
జనవరి 5, 2023 – (గురు గోబింద్ సింగ్ జయంతి – హర్యానా, రాజస్థాన్)
జనవరి 8, 2023 – ఆదివారం (దేశం మొత్తం)
జనవరి 14, 2023 – మకర సంక్రాంతి (రెండవ శనివారం)
జనవరి 15, 2023 – కనుమ/ ఆదివారం(అన్ని రాష్ట్రాలకు సెలవు)
జనవరి 22, 2023 – ఆదివారం
జనవరి 23, 2023 – నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి( త్రిపుర, పశ్చిమ బెంగాల్)
జనవరి 25, 2023 – రాష్ట్ర దినోత్సవం(హిమాచల్ ప్రదేశ్)
జనవరి 26, 2023 – గణతంత్ర దినోత్సవం(అన్ని రాష్ట్రాలకు సెలవు)
జనవరి 28, 2023 – నాల్గవ శనివారం
జనవరి 29, 2023-ఆదివారం
జనవరి 31, 2023 – మి-డాం-మి-ఫి(అస్సాం)