Hyundai loniq 5: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కార్.. అదిరిపోయిన ఫీచర్లు! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
ఇదే క్రమంలో హ్యూందాయ్ కూడా ఒక ఆసక్తి కర అప్ డేట్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన తన ఎలక్ట్రిక్ వేరియంట్ కారు ఐనిక్ 5ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కారులో ఉండే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ప్రకటించింది.

కొత్త సంవత్సరంలో మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాలు క్యూ కట్టనున్నాయి. ఇప్పటి పలు దిగ్గజ కంపెనీలు తమ టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే క్రమంలో హ్యూందాయ్ కూడా ఒక ఆసక్తి కర అప్ డేట్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన తన ఎలక్ట్రిక్ వేరియంట్ కారు ఐనిక్ 5ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కారులో ఉండే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ప్రకటించింది. అంతేకాక రూ. లక్ష టోకెన్ చార్జితో బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ హ్యూందాయ్ ఐనిక్ 5 ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలను చూద్దాం..
బ్యాటరీ.. మైలేజీ..
ఐనిక్ 5 మోడల్ కారులో బ్యాటరీ 72.6 kwh సామర్థ్యంతో వస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ చార్జింగ్ కోసం 350kw చార్జర్ వినియోగిస్తే 10 నుంచి 80 శాతం వరకూ కేవలం 18 నిమిషాల్లో చార్జ్ అవుతుంది.
ఫీచర్స్.. స్పెసిఫికేషన్స్..
ఐనిక్ 5 మోడల్ కారు 214 bhp, 350 Nm టార్క్ అవుట్ పుట్ కలిగిన మోటార్ తో వస్తుంది. దీనిలో V2L అంటే వెహికల్ టు లోడ్ ఫీచర్ వస్తోంది. దీని ద్వారా వినియోగదారుల వస్తువులకు ఎలక్ట్రిక్ సప్లైని అందిస్తుంది. అలాగే రెండు 12.3inch టచ్ స్క్రీన్స్ ఉంటాయి. అంతేకాక వాయిస్ అసిస్టెంట్, ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్ వంటి దాదాపు 60 రకాల ఫీచర్లు కారులో అందుబాటులో ఉంటాయి.



సేఫ్టీ ఇలా..
ఐనిక్ 5 మోడల్ కారులో లెవెల్ 2 అడాస్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. పలు రకాల కొలిషన్ వార్నింగ్ లతో పాటు కారులో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్, నాలుగు డిస్క్ బ్రేక్ లు వినియోగదారుల ప్రయాణానికి భరోసా ఇస్తాయి.
ధర ఎంతంటే..
హ్యుందాయ్ ఐనిక్ 5ని 2023 జనవరి 11న నిర్వహించే ఆటో ఎక్స్ పో లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 50 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంది. కాగా ఇదే ఫీచర్లతో కియా కంపెనీకి చెందిన ఈవీ6 కారు రూ. 59.95 లక్షల నుంచి 64.95 లక్షల వరకూ ఉంది. దాని కన్న తక్కువ ధరకే హ్యూందాయ్ కారును అదే ఫీచర్లతో అందిస్తుండటం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..