AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్

బ్యాంకుల కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మే 1న మేడే సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఇక మే 3న ఆదివారం రావడంతో బంద్ కానున్నాయి. దీంతో బ్యాంకులకు వెళ్లేవారు దీనిని గమనించాలి.

Bank Holidays: రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్
Bank Holidays New
Venkatrao Lella
|

Updated on: Apr 26, 2026 | 8:01 PM

Share

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మే 1, 3వ తేదీలలో బంద్ కానున్నాయి. ఇందులో ప్రాంతీయ, దేశీయ సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు అనేవి ఉంటాయి. దీంతో బ్యాంక్ సెలవులు గురించి కస్టమర్లు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది. ఏ రోజు తెరుచుకుని ఉంటాయి..? ఏ రోజు మూసి ఉంటాయి? అనేది తెలుసుకోవాలి. రాబోయే వారంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.

రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం మే 1న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ రోజున కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక మే3వ తేదీన ఆదివారం రావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు రానుంది. దీంతో రాబోయే వారంలో ఏకంగా రెండు రోజులు బ్యాంకులు ఉండవు. కస్టమర్లు దీనిని గమనించి తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి. బ్రాంచ్ నుంచి చేసే నగదు లావాదేవీలు, చెక్కు సంబంధిత పనులు నిలిచిపోతాయి. ఇక డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అన్ లైన్, మొబైల్, యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇక ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో నగదు బదిలీలు, బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్ వంటివి ఎప్పటిలాగే చేసుకోవచ్చు.

మే నెలలో 13 సెలవులు

కేవలం డ్రాఫ్ట్, చెక్కుల క్లియరెన్స్, పేపర్ లావాదేవీలు అనేవి నిలిచిపోతాయి. ఈ సేవలు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం పరిధిలోకి వస్తాయి. అందుకే బ్యాంక్ సెలవు రోజుల్లో నిలిచిపోతాయి. ఇక మే నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. మే నెలలో 3,10,17,24,3న ఆదివారాలు, మే 9,23న రెండు, నాల్గో శనివారాలు వచ్చాయి. దీంతో ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.

Follow Us