Business Ideas: మహిళల కోసం.. ఇంట్లోనే ఉంటూ జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో.. నెలకు 90 వేలు సంపాదించే బిజినెస్!
మహిళలకు ఇంటివద్ద నుండే అధికాదాయం సంపాదించే అద్భుత అవకాశం! తక్కువ పెట్టుబడితో గాజుల డిజైనింగ్ వ్యాపారం ప్రారంభించండి. చీరలకు మ్యాచింగ్ గాజులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. మీ సృజనాత్మకతతో ప్రత్యేక డిజైన్‌లు రూపొందించి, నెలకు రూ.50వేల నుండి రూ.90వేలు సంపాదించవచ్చు.

ఉద్యోగం చేయాలని ఉన్నా.. ఇంటి పనులతో, కుటుంబ బాధ్యతలతో ఇంటి పట్టునే ఉండే మహిళల్లో చాలా మందికి ఓ చిన్న బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారి కోసం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఈ బిజినెస్ చేయాలంటే కాస్త క్రియేటివ్ మైండ్‌సెట్ ఉండాలండోయ్. పైగా ఈ బిజినెస్‌కు అతి తక్కువ పెట్టుబడి అవుతుంది. ఆదాయం మాత్రం నెలకు రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఐడియా ఏంటంటే..
ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా ఫ్యాషన్ వస్తువులను ధరించేందుకు, ట్రెండీగా కనిపించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి మ్యాచింగ్ ఉండేలని కోరుకుంటున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా చేతికి ధరించే గాజులు తమ చీరతో మ్యాచింగ్ అవ్వాలని ఎక్కువగా ఆశపడుతుంటారు. కేవలం కలర్ మ్యాచింగ్ ఉంటే సరిపోదు. చీర డిజైన్‌తో గాజులు మ్యాచ్ అవ్వాలని అనుకుంటున్నారు. దీన్నే మీరు ఓ చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. చీర డిజైన్లను మీరు గాజులను కూడా అదే తరహాలో డిజైన్ చేసి అందుబాటులో వచ్చినట్లయితే మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇది చాలా సింపుల్ బిజినెస్ ఇంటివద్ద ఉండి మహిళలు చేసుకోవచ్చు. దీని కోసం ప్లెయిన్ గాజులను కొనుగోలు చేసి, ఎంపిక చేసిన చీర డిజైన్ ను బట్టి దానిపైన మీరు గాజులను డిజైన్ చేసి ఇవ్వడం ద్వారా చక్కటి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే డిజైన్స్ ను వీడియోలుగా మడిచి ఇంస్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్ బుక్ లో కానీ అప్ లోడ్ చేసినట్లయితే, ఈ ఫ్యాషన్ గురించి అవగాహన ఉన్నవారు మీకు ఆర్డర్లు అందించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అతి తక్కువ పెట్టుబడి తోనే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లను పొందడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




