ధంతేరాస్ వేళ పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు
ధంతేరస్ వేళ పసిడి ప్రియులకు ఊరట లభించింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర 3వేల 180 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 32వేలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 22వేల 230 దగ్గర కొనసాగుతోంది కిలో వెండి ధర రూ.లక్షా 79వేల 600 దగ్గర కొనసాగుతోంది.
కొద్దిరోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం తగ్గాయి. అయినా ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొద్ది నెలలుగా బంగారం ధరల్లో నమోదైన పెరుగుదలలో దాదాపు 20 శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందన్నారు. రూపాయి బలహీనపడినప్పుడు అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే ఈమధ్య కాలంలో జరుగుతూ వస్తోందన్నారు. దీపావళి పండగ ధన్‌తేరాస్‌తోనే ప్రారంభం అవుతుంది. దీపావళికి రెండు రోజులు ముందు ఇది వస్తుంది. దాదాపు 5 రోజుల పాటు సాగుతాయి. ఈ పండగ రోజున గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటాయి. వీటిని కొనాలంటే సామాన్యులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. రానున్న కాలంలో మధ్యతరగతి వర్గం, వేతన జీవులు బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..
తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

