AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

Phani CH
|

Updated on: Oct 18, 2025 | 8:12 PM

Share

కొన్ని ఊరి పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి.. అలాగే కొన్ని వింత వింతగా ఉంటాయి.. అసలు ఇలాంటి పేర్లు కూడా ఉంటాయ అని షాక్ అవ్వాల్సి వస్తుంది. పండుగ పేర్లు ఉండడం చాలా అరుదు.. అలాగే దీపావళి అనే పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరు ఉందని మీకు తెలుసా? అవును జిల్లాలోని గార మండలంలో దీపావళి గ్రామ౦ ఉంది.

జిల్లా కేంద్రం నుండి శ్రీకూర్మం వెల్లే మార్గంలో శ్రీకాకుళంకి సరిగ్గా 9 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ ఊరు పేరు వెనుక పెద్ద చరిత్ర ఉంది. పూర్వం ఓ సామంత రాజైన ఓ కళింగ రాజు శ్రీకాకుళం నుంచి కళింగపట్నానికి ఈ ఊరు మీదుగా వెళ్లేవారట. అలా వెళ్లే క్రమంలో ప్రస్తుతం దీపావళి ఆని పిలువబడుతున్న గ్రామం శివారులో ఉండే లక్ష్మీ నారాయణ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి కళింగరాజు ఆలయం వద్ద పూజలు చేసి తిరిగి వెళుతున్నా క్రమంలో ఆలయం వద్ద గుర్రంపై నుండి పడిపోయి.. స్పృహ కోల్పోయాడట. అప్పుడు గ్రామస్తులు ఆలయం సమీపంలో ఉండే బావి నుండి నీళ్లు తెచ్చి రాజుగారికి పట్టి సపర్యలు చేసి రక్షించారు.అది కూడా సరిగ్గా దీపావళి రోజున జరిగింది. రాజు గారు స్పృహ నుండి కోలుకున్నాక తనకు సపర్యలు చేసినవారికి కృతజ్ఞతలు తెలిపి ఇది ఏ ఊరు అని అడగగా ఈ ఊరికి పేరులేదని చెప్పడంతో.. నీరు పట్టి దీపావళి రోజున తన జీవితంలో వెలుగులు ని౦పిన౦దుకు గాను రాజు దీపావళి అని ఆ గ్రామానికి నామకరణం చేశారు. రెవెన్యూ రికార్డులలో సైతం దీపావళి ఆని ఆ గ్రామాన్ని నోట్ చేశారు. అప్పటి నుండి ఈ గ్రామం దీపావళిగా వెలుగొందుతో౦ది. ఈ దీపావళి గ్రామం 900 కుటుంబాలతో 2 వేల ఓట్లు ఉన్న గ్రామం ఇది.. ఈ గ్రామం గొంటి పంచాయితీలో ఉంది. అయితే ఈ పేరు గార మ౦డల౦లో కాస్త తెలిసిందే అయినా జిల్లాలోని ఇతర ప్రాంతాల వారికి మాత్రం వినగానే ఆశ్చర్యం కిలిగిస్తో౦ది. ఈ గ్రామానికి చెందిన వారు విద్య, ఉపాధి కోసం బయట ఊళ్ళకు వెల్లినపుడు అక్కడ వారికి తమ ఊరు పేరు చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారని కొందరు ఎగతాళి చేస్తే కొందరు ప౦డగ పేరునే మీ ఊరుకి పెట్టుకున్నార౦టూ అభినందిస్తూ ఉంటారని గ్రామంలోని యువత, మహిళలు చెబుతున్నారు. మొత్తానికి హిందువులందరికీ ఏడాదిలో ఒక్క రోజే దీపావళి పండుగ అయితే గ్రామనికే ప౦డగ పేరు పెట్టటంతో ఈ గ్రామానికి రోజూ దీపావళి లాగ ఫీల్ అవుతున్నారు గ్రామస్తులు. దీపావళి పేరుతో జిల్లాలో రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది దీపావళి గ్రామం. ఇపుడు ఆనోట ఈ నోట ఈ గ్రామం గురించి చర్చించుకు౦టున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్తామామలను రెండు పీకి.. కట్‌ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే

త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??

అతిగా స్మార్ట్‌ఫోన్ చూస్తే.. అంతే సంగతులు