AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

Phani CH
|

Updated on: Oct 18, 2025 | 6:59 PM

Share

సాధారణంగా ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డ్ పహారా కాస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటి పరిధిలోని కేటీ రోడ్ లో ఉన్న SBI ఏటీఎం కేంద్రంలో ఓ ఆంబోతు తిష్ట వేసింది. దొంగలనే కాదు కస్టమర్లను, చివరకు బ్యాంక్ సిబ్బందిని కూడా ATM లోకి రాకుండా అడ్డుకుంది. బయట వాతావరణం ఎండగా ఉండటంతో ఎంచక్కా నెమ్మదిగా ATM కేంద్రంలోకి దూరింది.

అక్కడ ఏసీ ఉండడంతో చల్లని వాతావరణంలో హాయిగా అక్కడే తిష్ట వేసింది. కాసేపటి తర్వాత బయటకు వద్దామని యత్నించిన… డోర్ ఓపెన్ కాలేదు. దీంతో ATM కేంద్రంలోనే చాలాసేపు ఉండిపోయింది ఆంబోతు. ఆ సమయoలో కస్టమర్లు ATMలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినప్పటికీ అక్కడ అంబోతు ఉండటం చూసి ఎవరూ లోపలకి వెళ్ళే దైర్యం చేయలేకపోయారు. పైగా చాలా సేపటి నుంచి ఆంబోతు లోపల ఉండడం.. లోపలికి ఎలా వెళ్లాలో తెలియక కస్టమర్లు కంగారు పడడం జరిగింది. బయటకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించినా డోర్ రాకపోవడంతో కాసేపు ఆంబోతు కంగారుపడుతూ అటు ఇటు తిరుగుతూ ATM కేంద్రంలో నానా హంగామా చేసింది. కొంత సమయానికి స్థానికులు దాని పరిస్థితిని గమనించి కాస్త సాహసం చేసి అతి కష్టంగా డోర్ తెరవడంతో ఎట్టకేలకు ఆంబోతు ATM కేంద్రం నుంచి బయటపడింది. దాంతో హమ్మయ అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??

అతిగా స్మార్ట్‌ఫోన్ చూస్తే.. అంతే సంగతులు

అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు

1638 కార్డులతో జల్సా.. కట్ చేస్తే గిన్నిస్ రికార్డు.. కారణం అదే

K- Ramp: కే ర్యాంప్‌ సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం.. అబ్బా అనిపించాడా ?? తెలియాలంటే వీడియో చూసేయండి