AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు

అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు

Phani CH
|

Updated on: Oct 18, 2025 | 6:44 PM

Share

కొన్ని నేరాలు చూస్తే.. మనుషులు మరీ ఇంత రాక్షసులుగా ఎలా ప్రవర్తిస్తారు? వీరికి కాస్తైనా జాలి, దయ ఉండవా? అనిపించక మానదు. భార్య అనారోగ్య సమస్యలను దాచి.. తనకు ఇచ్చి పెళ్లి చేశారనే కోపంతో బెంగళూరులో మహేంద్ర రెడ్డి అనే ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. 2024లో కృతికా రెడ్డి అనే డాక్టర్‌తో ఇతనికి వివాహం అయింది.

అయితే.. పెళ్లికి ముందే కృతికా రెడ్డికి షుగర్, గ్యాస్ట్రిక్ సమస్యలున్నాయి. పెళ్లైన తర్వాత దీని గురించి మహేందర్ రెడ్డికి తెలిసింది. కృతిక అనారోగ్య సమస్యల గురించి తన వద్ద దాచి పెళ్లి చేసి.. తనను మోసగించారని అత్తామామల మీద అతడు రగిలిపోయాడు. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించాడు. అందుకు వైద్యాన్ని వాడుకోవాలని ప్లాన్ చేశాడు. ఇదే సమయంలో అనారోగ్యం పాలైన అతడి భార్య మార్తహళ్లిలోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లింది. దీంతో మహేంద్ర రెడ్డి ఆమెను పరామర్శించడానికి అత్తగారింటికి వెళ్లి.. భార్యకు తానే వైద్యం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే వినియోగించే.. ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చాడు. దీంతో, ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్యం విషమించి… శ్వాస తీసుకోలేని స్థితికి చేరింది. దీంతో ఆమెని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మొదట్లో ఆమెది సహజ మరణంగా ఆమె తల్లిదండ్రులు భావించారు. పోలీసులు కూడా అన్‌నేచురల్ డెత్ అనే రిపోర్ట్ ఇచ్చారు. విషయం సద్దుమణిగింది అనుకున్న తర్వాత మహేందర్ రెడ్డి మణిపాల్ వెళ్లి అక్కడే క్లినిక్ తెరిచాడు. అయితే, కృతిక మృతి పై ఆమె అక్క, రేడియాలజిస్ట్ డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. ఆమె తన సోదరి మృతిపై సమగ్ర విచారణకు పట్టుబట్టింది. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్‌ రిపోర్ట్‌ వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాల్లో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. దీని కారణంగానే ఆమె మరణించిందని స్పష్టంగా తేలింది. దీంతో మార్తహళ్లి పోలీసులు.. మణిపాల్ వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. తానే కృతికకు అనస్తీషియా ఓవర్‌ డోస్‌ ఇచ్చి హత్య చేసినట్లు అతడు తన నేరాన్ని అంగీకరించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

1638 కార్డులతో జల్సా.. కట్ చేస్తే గిన్నిస్ రికార్డు.. కారణం అదే

K- Ramp: కే ర్యాంప్‌ సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం.. అబ్బా అనిపించాడా ?? తెలియాలంటే వీడియో చూసేయండి

పిల్లలకు పేర్లు పెడుతూ కోట్ల సంపాదన.. ఒక్కో పేరుకు రూ. 27 లక్షలు

త్వరలో వందే భారత్ 4.0.. గంటకు 320 కి.మీ స్పీడ్‌

2026లో అంతా విధ్వంసమే బాబా వంగా సరికొత్త జోస్యం